Story of Narendra Modi: ఇది మోదీ స్టోరీ: నరేంద్ర మోదీ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన క్షణాలు

"ది మోడీ స్టోరీ" పేరుతో ప్రారంభించిన ఈకార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలను ఒక వెబ్ సైట్ లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు ఆయన ప్రయాణం

Story of Narendra Modi: ఇది మోదీ స్టోరీ: నరేంద్ర మోదీ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన క్షణాలు

Modi

Story of Narendra Modi: గత ఎనిమిదేళ్లుగా దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ..దేశాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ..భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అన్ని వర్గాల ఆదరాభిమానాలను సంపాదించారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో పసిబిడ్డలను కలుసుకోవడం నుంచి.. కాశ్మీర్ లోని అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులతో గడపడం వరకు ప్రధాని మోదీ తనదైన విలక్షణాన్ని ప్రదర్శించారు. ఆత్మనిర్భర్ భారత్, మన్ కీ బాత్, వంటి కార్యక్రమాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో ప్రధాని మోదీ మమేకం అవుతుంటారు. విజయానికి మెట్టు దూరంలో ఆగిపోయిన చంద్రయాన్ వైఫల్యంతో కృంగిపోయిన ఇస్రో చైర్మన్ కే.శివన్ ను హత్తుకుని ఓదార్చినా..ప్రయాగ్ రాజ్ కుంభ మేళలో పనిచేసిన సఫాయి కర్మాచార్యుల పాదాలు కడిగినా..తాను ఎల్లపుడు ప్రజాసేవకుడినే అనే మోదీ విధానానికి దేశ ప్రజలు జేజేలు కొట్టారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజల కోసం, దేశం కోసం నిరంతరం తన శక్తిని ధార పోస్తున్నారు మోదీ.

Also Read:Ramya Bharathi IPS : అర్థరాత్రి మహిళా ఐపీఎస్‌ సైకిల్ పై గస్తీ..షాక్ అయిన పోలీసులు..ప్రశంసించిన సీఎం

అయితే ప్రధాని మోదీ గురించి దేశ ప్రజలు మరింత తెలుసుకునేలా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “ది మోడీ స్టోరీ” పేరుతో ప్రారంభించిన ఈకార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలను ఒక వెబ్ సైట్ లో పొందుపరిచారు. మోదీ రాజకీయ నేతగా ఎదిగిన తీరు, ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు ఆయన ప్రయాణం, ప్రధానిగా విభిన్న వర్గాల ప్రజలతో మోదీ మమేకవుతున్న తీరు వంటి విషయాలను చిత్రమాలికలుగా రూపొందించి “modistory.in” అనే వెబ్ సైట్ లో పొందుపరిచారు. రాజకీయ నేతగా మోదీ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఆయనతో అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేసిన కొందరు వ్యక్తుల ఆలోచన నుంచి ఈ బృహత్తర కార్యక్రమం పుట్టుకొచ్చింది. మోదీని అతిదగ్గరగా చూసిన వ్యక్తులు, సన్నిహితులు మోదీతో తమ అనుబంధాన్ని పంచుకుంటూ, ఆయన వ్యక్తిత్వాన్ని దేశ ప్రజలకు తెలిసేలా “ది మోడీ స్టోరీ” రూపొందించారు.

Also Read:Pending Cases : దేశంలో 4.70కోట్ల కేసులు పెండింగ్ : కేంద్రం

ఈకార్యక్రమాన్ని మహాత్మా గాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ఇటీవల ప్రారంభించారు. modistory.in వెబ్ సైట్ ప్రారంభించిన సందర్భంగా బీజేపీ నేతలు ప్రధాని మోదీపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఇటువంటి మహానేత భారత ప్రజలకు దక్కడం మనందరి అదృష్టమంటూ బీజేపీ నేతలు ప్రశంసిస్తున్నారు. నరేంద్ర మోదీని దగ్గరుండి చూసిన వ్యక్తులకు సంబంధించిన అన్ని ప్రత్యక్ష కథలు మరియు వృత్తాంతాలు మరియు జ్ఞాపకాలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెబ్‌సైట్ నిర్వాహకులు పేర్కొన్నారు. వీడియో, ఆడియో లేదా వ్రాత రూపంలో ఎవరైనా సేకరణకు సహకరించవచ్చని సుమిత్రా గాంధీ కులకర్ణి పేర్కొన్నారు.

Also read:Uddhav Thackeray : దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి : ఉద్ధవ్‌ ఠాక్రే

వెబ్ సైట్ లో పొందుపరిచిన విభిన్న కథనాలలో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ప్రధాని మోదీని కలిసి తన అనుభవాన్ని పంచుకునే వీడియో సందేశం కూడా ఉంది. “మేము భారత ప్రధానిని కలుస్తున్నట్లు మాకు అనిపించలేదు. మోదీ తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్క ఆటగాడితో మాట్లాడి వారి వ్యక్తిగత బాగోగులు తెలుసుకున్నారు. నరేంద్ర మోది ప్రధానమంత్రి అయినప్పటి నుండి దేశంలో క్రీడలలో చాలా మార్పులు వచ్చాయి” అని నీరజ్ చోప్రా తన వీడియో సందేశంలో వివరించారు. భారత బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపి చాంద్ సైతం ప్రధాని మోదీతో తన అనుభవాలు పంచుకున్న వీడియో ఈ వెబ్ సైట్లో ఉంది.

Also read:Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ లో రూ.8,799 నుంచే యాపిల్ ఐఫోన్: ఇంకా మరెన్నో డీల్స్