భారత్ 20 అణుబాంబులేస్తే..పాక్ నాశనమైపోతుంది

పాకిస్తాన్ ఒక్క అణుబాంబుతో భారత్ పై దాడి చేస్తే..20 అణుబాంబులతో భారత్ తమ దేశాన్ని నామారూపాల్లేకుండా ఫినిష్ చేస్తుందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని, భారత్ దాడి చేసే ముందే పాక్ 50 అణుబాంబులతో భారత్ పై దాడి చేయాలన్నారు.పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య సంబంధాలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయన్నారు.
దుబాయ్ లో ఉంటున్న ముషార్రఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ లో రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు కన్పిస్తే తాను తిరిగి పాక్ కు వెళుతానని ముషార్రఫ్ తెలిపారు. ఇమ్రాన్ ప్రభుత్వంలోని మంత్రుల్లో సగం మంది తనవాళ్లేనని అన్నారు. న్యాయశాఖ మంత్రి, అటార్నీ జనరల్ తన లాయర్లు అని తెలిపారు.
1999లో సైనాధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్ అప్పటి అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ని తప్పించి పాక్ ప్రెసిడెంట్ గా భాధ్యతలు చేపట్టారు. తొమ్మిదేళ్ల పాటు పాక్ ప్రధానిగా ఉన్నారు. 2007లో రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది. చికిత్స కొోసం దుబాయ్ వెళ్లిన ఆయన ఇప్పటివరకు పాక్ లో అడుగుపెట్టలేదు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన సూత్రధారి ముషార్రఫ్.