Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టులతో అట్టుడుకుతున్న పాక్ .. క్వెట్టాలో కాల్పులు, పలువురు మృతి

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్తాన్ లో హింసాత్మకంగా మారింది. ఇమ్రాన్ అరెస్ట్ తో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టులతో అట్టుడుకుతున్న పాక్ .. క్వెట్టాలో కాల్పులు, పలువురు మృతి

PTI Leaders Call For Nationwide Protests

Updated On : May 10, 2023 / 11:38 AM IST

Imran Khan Arrest: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ (Imran Khan Arrest)తో పాకిస్తాన్ (pakistan) అట్టుడుకిపోతోంది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్‭లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ (pakistan) వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

దీంట్లో భాగంగా పాక్ లోని క్వెట్టాలో ఆందోళనకు హింసాత్మకంగా మారాయి.భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి. నిరసనకారులను అదుపు చేయటానికి కాల్పులు జరిపారు.దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో ఆమ్రాన్ ఖాన్ అభిమానులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో భద్రతాబలగాలు వారిని నియంత్రించటానికి కాల్పులు జరుపుతున్నారు. ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పలు ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రతరం కావటంతో విద్యాసంస్థలను మూసివేశారు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రపంచ ట్విట్టర్ ట్రెండులో ఇమ్రాన్ ఖాన్ (#ImranKhan) అనే హ్యాష్‭ట్యాగ్ టాపులో ఉంది. ఇమ్రాన్‭ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోలను ఫొటోలను షేర్ చేస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. తోషాఖానా కేసులో తనను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఈ జమాన్ పార్కులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ నివాసానికి చేరుకోక ముందే ఒక వీడియో రికార్డు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన పార్టీ అయితే తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతలు ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇమ్రాన్ ను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో పోలీసుల కంటే ముందే ఆయన నివాసానికి మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులకు పీటీఐ కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఇమ్రాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులపై పీటీఐ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. విదేశాల నుంచి ఇమ్రాన్ అందుకున్న ఖరీదైన బహుమతులను లాభాల కోసం విక్రయించారని బలమైన ఆరోపణల నేపథ్యంలో తాజా అరెస్ట్ చోటు చేసుకుంది.