ప్రపంచం భారత్‌ను నమ్ముతుంది.. పాకిస్తాన్‌ను కాదు

ప్రపంచం భారత్‌ను నమ్ముతుంది.. పాకిస్తాన్‌ను కాదు

Updated On : September 13, 2019 / 9:23 AM IST

కశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత్‌నే నమ్ముతుంది కానీ, పాకిస్తాన్ ను కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా తెలిపాడు. కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్‌ చేసిన కృషి ఎవ్వరికీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ‘కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి ప్రజలకు మెడిసిన్ కూడా అందకుండా చేశారు. అయినా ప్రపంచం మాపై నమ్మకం ఉంచదు కానీ, భారత్‌నే నమ్ముతుంది’ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ విషయంలో తమకు 58దేశాల నుంచి సపోర్ట్ వస్తుందని తెలిపారు. ఇంకా జైషే మొహమ్మద్, హఫీజ్ సయ్యద్ జమాత్ ఉద్ దావాలను ఓ దారిలో పెట్టాలనే తాము చూస్తున్నట్లు పేర్కొన్నారు. 

‘జమాత్ ఉద్ దావా కోసం మిలియన్ రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్లు అఫ్ఘనిస్తాన్‌లో పోరాడుతున్నారు. వాళ్లు పాకిస్తానీలే. వారిని అదుపు చేయాలని తప్పుడు చర్చలు చేయకుండా అడ్డుకోవాలని చూస్తున్నామని’ మంత్రి హఫీజ్ సయ్యద్ చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370రద్దుపై న్యాయం జరిగేవరకూ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.