ఇండియా సాయం కోరిన పాకిస్థాన్.. పోనీలే అని ఓకే చెప్పిన భారత్
భారత అధికారులు నాలుగు గంటల్లో క్లియరెన్స్ ఇచ్చారు.
flood hit Sri Lanka
Sri Lanka floods: వరదల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న శ్రీలంకకు పాకిస్థాన్ విమానంలో సహాయక సామగ్రిని పంపడానికి భారత్ ఓవర్‌ఫ్లైట్ అనుమతి ఇచ్చింది. అంటే మన గగనతలం మీదుగా పాకిస్థాన్ విమానం శ్రీలంకకు వెళ్లేందుకు అనుమతి దక్కింది.
భారత్ గగనతల అనుమతిని నిరాకరించిందని పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దీంతో పాక్ మీడియా వార్తలను భారత అధికారులు ఖండించారు. అత్యవసర సహాయ చర్య కావడంతో పాక్ అభ్యర్థనను కొన్ని గంటల్లోనే భారత అధికారులు అంగీకరించారని తెలిపారు. (Sri Lanka floods)
భారత్ గగనతల అనుమతి నిరాకరించిందని ఆన్‌లైన్‌లో వచ్చిన ఆరోపణలకు ఈ వివరణ ఇస్తున్నట్లు భారత అధికారులు చెప్పారు. భారత అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ డిసెంబరు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారికంగా అనుమతి అభ్యర్థనను పంపింది.
Also Read: కర్ణాటకలో సీఎం మార్పు.. సిద్ధరామయ్య సంచలన కామెంట్స్.. అదే జరిగితే డీకే శివకుమారే సీఎం..
అదే రోజు భారత గగనతలంలో ప్రయాణించడానికి పాక్ అనుమతి కోరింది. భారత అధికారులు నాలుగు గంటల్లో క్లియరెన్స్ ఇచ్చారు. శ్రీలంకకు మానవతా సహాయం పంపే అభ్యర్థన కావడంతో, భారత ప్రభుత్వం వేగంగా అనుమతి ఇచ్చింది.
సైక్లోన్ దిత్వాహ్ కారణంగా శ్రీలంక భారీగా నష్టపోయింది. ఈ తుపాను వల్ల శ్రీలంకలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఇళ్లు కోల్పోయారు. శ్రీలంక నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
విపత్తు తీవ్రత కారణంగా శ్రీలంక ప్రభుత్వం పలు దేశాల సాయం కోరింది. నావల్, ఎయిర్, డిజాస్టర్ రెస్పాన్స్ బలగాల భారీ డిప్లాయ్‌మెంట్‌తో భారత్ ముందు నుంచి సాయం అందిస్తోంది.
