Thomas Cup 2022 : థామస్ కప్ భారత్ కైవసం.. డబుల్స్ లో ఇండోనేషియాపై విజయం

ఇండోనేషియా జోడీపై భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలిచారు. ఇండోనేషియా జోడీపై 18-21, 23-21, 21-19తో భారత్ జోడీ గెలుపొందింది.

Thomas Cup 2022 : థామస్ కప్ భారత్ కైవసం.. డబుల్స్ లో ఇండోనేషియాపై విజయం

Thomas Cup

Updated On : May 15, 2022 / 3:58 PM IST

Thomas Cup final 2022 : వరల్డ్ బ్యాడ్మింటన్ లో భారత్ సువర్ణాధ్యాయం లిఖించింది. థామస్ ఉబెర్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. థామస్ కప్ లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత జట్టు తొలిసారి స్వర్ణం గెలిచింది. ఫైనల్ లో భారత్ సంచలనం విజయం సాధించింది. ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత్ గెలుపొందింది.

డబుల్స్ లో ఇండోనేషియాపై భారత్ విజయం సాధించింది. ఇండోనేషియా జోడీపై భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలిచారు. ఇండోనేషియా జోడీపై 18-21, 23-21, 21-19తో భారత్ జోడీ గెలుపొందింది. భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్, ప్రణయ్ లక్ష్యసేన్ సత్తా చాటారు.

Thomas Cup 2022: పురుషుల బ్యాడ్మింటన్‌లో తొలి సారి గోల్డ్ సాధించిన ఇండియా

14 సార్లు చాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాపై వరుస సెట్లలో గెలుపొందారు. ఫైనల్స్ తొలి సింగిల్స్ లో గింటింగ్ పై లక్ష్యసేన్ విజయం సాధించారు. డబుల్స్ లో ఇండోనేషియాపై టీమిండియా విజయం సాధించింది. అసాన్, సంజయ జోడీపై సాత్విక్ సాయిరాజజ్, చిరాగ్ శెట్టి జోడీ గెలుపొందారు.