డ్రాగన్ పై వార్‌కు సర్వం సిద్ధం.. సై అంటోన్న ఇండియన్ ఆర్మీ

డ్రాగన్ పై వార్‌కు సర్వం సిద్ధం.. సై అంటోన్న ఇండియన్ ఆర్మీ

Updated On : September 4, 2020 / 7:20 PM IST

దేశానికి తూర్పు వైపున.. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయ్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. ఇండియన్ ఆర్మీ.. తుపాకులు పట్టుకొని కాచుక్కూర్చొన్నాయ్. యుద్ధ ట్యాంకులు లోడ్ చేసి రెడీగా ఉన్నాయ్. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్స్ గాల్లో చక్కర్లు కొడుతున్నాయ్. ప్రస్తుతమున్న పరిస్థితి ఏమాత్రం దిగజారినా.. యుద్ధం తప్పదనే సంకేతాలిస్తోంది లద్దాఖ్. అసలేం జరుగుతోంది.. ఇండో-చైనా బోర్డర్‌లో.?

ఎల్ఏసీలో.. ఆపరేషన్ డ్రాగన్ మొదలుపెట్టింది ఇండియన్ ఆర్మీ. రెండు రోజులుగా.. ఇండియన్ ఆర్మీ చీఫ్.. ఎంఎం నరవణె కూడా అక్కడే తిష్ట వేశారు. సరిహద్దుల్లో.. సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడేం జరిగినా.. తేల్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చివరిగా.. యుద్ధమే గనక చేయాల్సి వస్తే.. చైనాను ఢీకొట్టాలని డిసైడైంది హిందుస్థాన్. సిచ్యువేషన్ ఏమాత్రం కంట్రోల్ తప్పినా.. చైనాకు చుక్కలే..

తాడో.. పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా:
భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయ్. ఏం జరిగినా సిద్ధంగానే ఉన్నాం. ఇది.. ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె డైలాగ్. దీనిని బట్టే.. అర్థం చేసుకోవచ్చు. ఇక చైనా విషయంలో.. ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని భారత్ నిర్ణయించుకుందని. తాడో.. పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉందని. సరిహద్దుల్లో.. చైనా గోడలా నిలబడ్డ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని.. బలంగా ఢీకొట్టి.. పడేయాలని ఇండియన్ ఆర్మీ డిసైడైంది.

లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్ సమీపంలో.. చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తోంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె.. రెండు రోజులుగా లద్దాఖ్‌ సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. ఎల్ఏసీ వెంట నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు వైపు చైనా సైన్యం కదలికలను గమనిస్తున్నారు. అన్ని విధాలా సిద్ధమవుతూ.. భారత సైన్యాన్ని సన్నద్ధం చేస్తున్నారు. దేశ భద్రత కోసం.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. బలగాలను మోహరించామని తెలిపారు నరవణె.

సిద్ధంగా భారత జవాన్లు:
చైనా సేనలు.. ఎల్ఏసీ దాటి భారత భూభాగంలోకి అడుగుపెడితే.. తిప్పికొట్టేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే ఉత్తమమైందన్నారు ఆర్మీ చీఫ్ నరవణె. దేశం గర్వించేలా.. సైన్యం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని.. అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

గత 3 నెలల నుంచి.. సరిహద్దుల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. సైనిక, దౌత్య మార్గాల్లో చైనాతో.. నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంది భారత్. డ్రాగన్ కంట్రీతో చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు. చర్చల ద్వారానే బోర్డర్‌లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుందని ఆర్మీ ఉన్నతాధికారులు కూడా భావించారు. కానీ.. వారం రోజుల నుంచి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. భారత్-చైనా సైనికాధికారుల మధ్య మళ్లీ చర్చలు జరుగుతున్నాయ్.

ఎల్ఏసీ నుంచి అస్సలు కదలడం
ఏం జరిగినా సరే.. చైనాతో తాడో-పేడో తేల్చుకోవాలని భారత్ డిసైడ్ అయింది. అందుకే.. చైనా విషయంలో చాలా పట్టుదలగా ఉంది. ఎల్ఏసీ నుంచి అస్సలు కదలడం లేదు. పాంగాంగ్ దక్షిణ రేవు ప్రాంతాన్ని కూడా.. చైనా కంటే ముందే మనోళ్లు స్వాధీనం చేసేసుకున్నారు. బ్లాక్ టాప్ హిల్‌పై జెండా ఎగరేశారు. చైనా ఎలాంటి స్టెప్ వేసినా.. బ్యాక్ స్టెప్ వేయకుండా సాలిడ్ ఆన్సర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే.. డ్రాగన్ కంట్రీకి ఏమీ తోచడం లేదు. ఇంతకుముందు.. బోర్డర్లో అలజడి సృష్టిస్తే చర్చలంటూ ముందుకు వచ్చే భారత్.. సడన్‌గా ప్రతి దాడికి సిద్ధమవడం చూసి చైనా మైండ్ బ్లాంక్ అవుతోంది.

ఎల్ఏసీ వెంట ఆర్మీ చీఫ్ నరవణె టూర్ కూడా చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపుతోంది. 2 రోజులుగా ఆయన అక్కడే తిష్ట వేయడం.. సరిహద్దుల వెంబడి నెలకొన్న పరిస్థితులను ఆరా తీయడం లాంటివన్నీ.. రెడ్ ఆర్మీకి.. రెడ్ సిగ్నల్ పంపుతున్నాయ్. నరవణె కూడా.. ఫ్రంట్ లైనర్స్‌ని సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. శత్రువు నుంచి ఎదురయ్యే దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్ని వేళలా.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైనికుల్లో గుండె ధైర్యం, ఆత్మ స్థైర్యం నింపుతున్నారు. అందుకే.. ఇప్పుడు అందరి అటెన్షన్.. లద్దాఖ్ వైపు మళ్లింది. సైన్యం ఫోకస్ మొత్తం.. ఎల్ఏసీపైనే ఉంది.