చైనా, పాక్‌లకు కౌంటర్ వేసేందుకు రూ.219కోట్లు ఖర్చుతో డ్రోన్ల కొనుగోలు

అమెరికా నుంచి 30 ఆర్మ్ డ్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తుంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ ల భూ భాగం, సముద్రం తలంపై బలగాలపై ఒత్తిడి నుంచి గట్టెక్కేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

చైనా, పాక్‌లకు కౌంటర్ వేసేందుకు రూ.219కోట్లు ఖర్చుతో డ్రోన్ల కొనుగోలు

Military us drones

Updated On : March 11, 2021 / 10:59 AM IST

India buying US drone: అమెరికా నుంచి 30 ఆర్మ్ డ్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తుంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ ల భూ భాగం, సముద్రం తలంపై బలగాలపై ఒత్తిడి నుంచి గట్టెక్కేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేర అధికారులు వచ్చే నెల నాటికి 30 MQ-9B కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

శాండిగో ఆధారిత జనరల్ అటామిక్స్ వీటిని తయారుచేయనుందట. ఆ తర్వాత ఇండియా మిలటరీకి అప్పగిస్తారు. ప్రస్తుతం సర్వేలెన్స్ కోసం మాత్రమే వాడుతున్నారు. ఇండియా.. అమెరికాకు స్ట్రాటిజక్ డిఫెన్స్ పార్టనర్ గా ఉంది. ప్రత్యేకించి హిందూ మహా సముద్రంలోని సౌత్ ఈస్ట్ ఆసియా కొన్ని ప్రాంతాల్లో చైనాను ఎదుర్కోవడంలో బాగా సహకరిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 10ఏళ్ల పాటు 250బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి మిలటరీని మోడరనైజ్ చేశారు.

ఇరు దేశాల దశాబ్దాల మైత్రికి ప్రస్తుతం కొనసాగుతున్న బంధాలే నిదర్శనం. అని జనరల్ అటామిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వివేక్ లాల్ అన్నారు. ఈ మైత్రికి అసలు కారణంగా డిఫెన్స్ కోపరేషన్ కోసమే. మ్యూచువల్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్ అనేది చాలా ప్రియారిటీగా ఉంది.

ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ, పెంటగాన్ అఫీషియల్స్ దీనిపై రెస్పాండ్ అవలేదు. గతేడాది ఇండియా రెండు MQ-9 ప్రిడేటర్స్ ను రిలీజ్ చేసింది. రీసెంట్ గా చైనాతో ఏర్పడిన సరిహద్దు సంక్షోభం కారణంగా ఇండియా మరింత ఎక్విప్‌మెంట్‌ను సిద్ధం చేసుకుంటుంది.