India Pakistan Tensions: పాకిస్తాన్ దాడులను చిత్తు చిత్తు చేస్తున్న భారత్.. ఎక్కడికక్కడ పాక్ డ్రోన్లు పేల్చివేత..

పాక్ దాడులను పసిగట్టిన ఇండియా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో డ్రోన్లను కూల్చేసింది.

India Pakistan Tensions: పాకిస్తాన్ దాడులను చిత్తు చిత్తు చేస్తున్న భారత్.. ఎక్కడికక్కడ పాక్ డ్రోన్లు పేల్చివేత..

Updated On : May 9, 2025 / 11:56 PM IST

India Pakistan Tensions: పాకిస్తాన్ దాడులను భారత్ చిత్తు చిత్తు చేస్తోంది. దాయాది దేశానికి ప్రతిరోజూ కాళరాత్రిని చేస్తోంది ఇండియన్ ఆర్మీ. పాక్ లో భారత్ అటాక్స్ తర్వాత ధీటుగా బదులిస్తామంటూ ప్రగల్బాలు పలికిన పాక్.. నిన్నటి (మే 8) నుంచి భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది. శుక్రవారం మరోసారి భారత్ లోని 11 ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు విఫలయత్నం చేసింది. పాక్ డ్రోన్లను భారత సైన్యం ఎక్కడికక్కడ పేల్చేసింది. జమ్ము, సాంబా, జైసల్మేర్, పఠాన్ కోట్, పూంచ్, ఫిరోజ్ పూర్, అమృత్ సర్, పోఖ్రాన్, ఉదంపూర్ లో డ్రోన్లతో దాడులకు దిగింది పాకిస్తాన్.

Also Read: పాక్‌ నుంచి ధనాధనా దూసుకొచ్చిన మిసైళ్లు, డ్రోన్లను భారత్ ఇలా ధ్వంసం చేసింది.. దాయాది దాడులు విఫలమైన తీరు ఇది..

ఫిరోజ్ పూర్ లో ఏకంగా జనా వాసాలే టార్గెట్ గా డ్రోన్ల దాడి చేసింది పాక్. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, పాక్ దాడులను పసిగట్టిన ఇండియా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో డ్రోన్లను కూల్చేసింది. భారత్, పాక్ సరిహద్దుల్లో భారీ శబ్దాలు వినిపించాయి. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వయంగా.. భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్, సాంబా, యురి, జైసల్మేర్ లో బ్లాక్ అవుట్ నిర్వహిస్తున్నారు.