మన డాక్టర్లకే కరోనా రక్షణ కిట్స్ లేవు.. సెర్బియాకు భారత్ 90 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపింది!

  • Published By: sreehari ,Published On : April 1, 2020 / 03:44 AM IST
మన డాక్టర్లకే కరోనా రక్షణ కిట్స్ లేవు.. సెర్బియాకు భారత్ 90 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపింది!

Updated On : April 1, 2020 / 3:44 AM IST

అసలే కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనా కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ  సమర్థవంతంగా లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. కరోనా సోకిన బాధితులకు చికిత్స అందించే వైద్యులకు సైతం ప్రొటెక్టివ్ కేర్ కొరత ఆందోళన కలిగిస్తోంది. మన డాక్టర్లకే సరైన కరోనా రక్షణ కిట్స్ లేకపోవడంతో హెల్మట్లు, రెయిన్ కోట్లతోనే రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

దేశంలోని మన వైద్యులకు కనీసం ప్రొటెక్టీవ్ గేర్ అందించలేని పరిస్థితుల్లో ఉన్న భారత్.. ఆగ్రేయ యూరప్ దేశమైన రిపబ్లిక్ సెర్బియాకు 90 టన్ను మెడికల్ ఎక్విప్ మెంట్ ప్రొటెక్టివ్ గేర్ పంపించినట్టు ఓ ట్వీట్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్వదేశంలోనే కరోనా ప్రొటెక్టివ్ గేర్ కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్ సెర్బియాకు ఎలా పంపింది అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించేందుకు నిరాకరించింది. 

ఒకవైపు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి కనీసం అవసరమైన రక్షణ కవచ దుస్తులు లేవని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందించలేమని అంటున్నారు.

మరోవైపు ఈ విషయాన్ని సెర్బియన్ భాగమైన UNDP (యూనైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 90 టన్నుల మెడికల్ ఎక్విప్‌మెంట్‌తో 2వ కార్గో బోయింగ్ 747 విమానంలో భారత్ నుంచి సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ లో ల్యాండ్ అయినట్టు ట్వీట్ చేసింది. అందులో 90 టన్నుల సరుకులో 50 టన్నుల సర్జరీ హ్యాండ్ గ్లోవ్ లు ఉన్నాయని, వైద్య సిబ్బందికి అవసరమయ్యే మాస్క్‌లు, కవరల్స్ కూడా ఉన్నట్టుగా ట్వీట్ లో పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు ఈ UNDP అండగా నిలుస్తోంది. మార్చి 29న మరో సరుకును పంపించామని, ఇందులో 35 లక్షల జతల శుభ్రమైన సర్జికల్ గ్లోవ్ ఉందని కొచ్చి విమానాశ్రయం ప్రతినిధి తెలిపారు. 

దీనిపై అడిగిన ప్రశ్నకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమకు తెలియదని చెప్పారు. సెర్బియాకు సంబంధించి ప్రస్తుతానికి తనకు ఎలాంటి సమాచారం లేదని  MoHFW జాయింట్ సెక్రటరీ లూవ్ అగర్వాల్ అన్నారు. 

రక్షణాత్మక దుస్తులు లేకుండా పనిచేసే వైద్య సిబ్బంది కరోనావైరస్ రోగులతో సంప్రదించిన తరువాత దేశవ్యాప్తంగా దాదాపు 100 మంది వైద్యులు క్వారంటైన్ అయ్యారు. వీరిలో చాలామంది వైరస్ బారిన పడ్డారు. లక్నోలో, ప్రతిష్టాత్మక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ అధికారులు, ఉత్తర ప్రదేశ్ లోని COVID-19 చికిత్స కేంద్రంగా ఉన్న ఒక వైద్యుడు వైరస్ బారిన పడ్డాడు. వారం తరువాత ప్రత్యేక రక్షణ పరికరాల కోసం OPD వైద్యుల అభ్యర్థనను తిరస్కరించారు. దేశంలోని కొన్ని చోట్ల వైద్యుల కోసం రెయిన్ కోట్స్, మోటారుబైక్ హెల్మెట్లను ఉపయోగిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.