India Voted Against Russia: ఐక్యరాజ్యసమితిలో మొదటిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన ఇండియా

ఉక్రెయన్ 31వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భద్రతా మండలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జెలెన్‭స్కీ ప్రసంగంపై ఓటింగ్ నిర్వహించారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. ఇంకా విధిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో భారత్ మాత్రం స్థిరంగా ఉంటోంది

India Voted Against Russia: ఐక్యరాజ్యసమితిలో మొదటిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన ఇండియా

India Vote Against Russia In UNSC

Updated On : August 25, 2022 / 7:43 PM IST

India Voted Against Russia: రష్యాతో భారతదేశానికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి స్నేహం ఉన్నప్పటికీ ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఇలా ఓటేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‭స్కీ భద్రతా మండలిలో ప్రసంగించాలనే తీర్మానం చేశారు. అయితే 15 మందితో కూడిన భద్రతా మండలిలో రష్యా ఇందుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, చైనా ఈ ఓటింగుకు దూరంగా ఉంది. మిగిలిన 13 దేశాలు ఇందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అందులో భారత్ ఒకటి.

ఉక్రెయన్ 31వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భద్రతా మండలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జెలెన్‭స్కీ ప్రసంగంపై ఓటింగ్ నిర్వహించారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. ఇంకా విధిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో భారత్ మాత్రం స్థిరంగా ఉంటోంది. ఇరు దేశాలు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని పదే పదే భారత్ చెప్తోంది. ఐక్యరాజ్యసమితి మాత్రం రష్యా తీరును తప్పు పడుతోంది. ఉక్రెయిన్ సరిహద్దులను బలవంతంగా మార్చే రష్యా ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం ఎప్పటికీ గుర్తించదని ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పేర్కొంది.

3Y Old Girl Wakeup At Her Funeral: చనిపోయిందని అంత్యక్రియలు చేస్తుండగా లేచిన 3 ఏళ్ల చిన్నారి.. మళ్లీ అంతలోనే..