పాక్ ప్రధానికి భారత ఆహ్వానం

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారత్ ఆహ్వానం పలకనుంది. షాంగాయ్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) వార్షిక సమావేశంలో భాగంగా ప్రభుత్వాధినేతల సదస్సు జరగనుంది. దీనికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరవ్వాలని ఆయనను కోరనున్నట్లు అధికారులు తెలిపారు. తుది నిర్ణయం ఇమ్రాన్ ఖాన్ దేనని వెల్లడించారు.
‘నియమాల ప్రకారం.. పాకిస్తాన్ ప్రధానికి ఆహ్వానం పంపుతాం. దీనికి పాక్ ప్రధాని హాజరవుతారా లేదా ఆయనకు బదులు వేరే ప్రతినిధి వస్తారా అనేది వారి ఇష్టం. ఈ మీటింగ్ కు ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఎవరో నిర్ణయించుకుంటారనుకుంటున్నాం’ అని ఓ అధికారి తెలిపారు.
కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ద ఎస్సీఓకు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోందని సెకట్రరీ జనరల్ వ్లాదిమీర్ అన్నారు. దీనికి విదేశాంగ మంత్రులు కూడా హాజరవుతారని సమాచారం. ఈ ఎస్సీఓను షాంగైలో 2001వ సంవత్సరం రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుల సమక్షంలో జరిగింది. ఇందులో భారత్, పాకిస్తాన్‌లు జూన్ 2017 పూర్తి స్థాయి సభ్యత్వం పొందాయి.