India: ఇండియా-చైనా కీలక ఒప్పందం.. అమెరికాతో సంబంధాలు.. విదేశాంగ విధానంపై మరోసారి స్పష్టత ఇచ్చిన భారత్
ఇటీవల కాలంలో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశమని, అమెరికా ఆదేశాల మేరకు భారత్ చైనాతో తలపడుతుందని చర్చ జరిగింది.

Modi government
India Foreign Policy: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారతదేశం తన అభివృద్ధి లక్ష్యాలను, భద్రతా సమస్యలను సమతుల్యం చేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇటీవల వరకు భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చే స్థాయికి వెళ్లింది. కానీ, ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంకోసం భారత్ వ్యవహారించిన తీరు ప్రపంచ దేశాలను ఆకర్షించింది. అదే సమయంలో అమెరికాతో మంచి సంబంధాలను కొనసాగిస్తాం.. అలాఅని అమెరికా ఆదేశాలను భారత్ పాటించదని మరోసారి రుజువు చేసింది.
గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తరువాత భారతదేశం తన భద్రతా విధానాన్ని మరింత జాగ్రత్త చేసింది. యూఎస్ తో వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టిసారించింది. ఇది క్వాడ్ (యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్) దేశాల సహకారాన్ని పెంచడానికి దారితీసింది. ఇది మాత్రమే కాదు.. ఆ సమయంలో పాశ్యాత్య దేశాలు కూడా భారతదేశానికి మద్దతునిచ్చాయి. చైనా దూకుడు ప్రవర్తనను ఖండించాయి. దీని వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు రాజకీయ మద్దతు కూడా లభించింది.
Also Read: ఇరాన్ అర్మాన్ వర్సెస్ ఇజ్రాయెల్ థాడ్..! పశ్చిమాసియాలో ఇక రక్తపాతమేనా?
ఇటీవల కాలంలో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశమని, అమెరికా ఆదేశాల మేరకు భారత్ చైనాతో తలపడుతుందని చర్చ జరిగింది. ఈ విషయంపై కొలంబియా యూనివర్శిటీలో సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జెప్రీ సాచ్స్ కొద్దిరోజుల కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం యునైటెడ్ స్టేట్స్ కు మిత్రదేశమని నేను నమ్మను. భారతదేశం ఒక సూపర్ పవర్ అని పేర్కొన్నారు. భారత్ ఒకరి సూచనలపై ఆధారపడదు. సొంత నిర్ణయాలపై ముందుకు సాగుతుంది. భారతదేశం చైనాకు వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ తో సంబంధాలను పెంచుకుంటుందనే ఆలోచన వాషింగ్టన్ లో ఒకరి కల. ఇది వాషింగ్టన్ లో ఎవరో చేసిన భ్రమ. వారు తప్పనిసరిగా పాస్ పోర్ట్ పొందాలి.. ఎందుకంటే ప్రపంచాన్ని చూడాలంటూ.. వాషిగ్టన్ ఆదేశాలను భారత్ పాటిస్తుందన్న వాదనపై జెప్రీ సాచ్స్ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. తాజాగా.. ఇండియా – చైనా మధ్య సంబంధాలను అదే విషయాన్ని రుజువు చేస్తోంది. అయితే, ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటన దేనికి సంబంధించి. పాశ్చాత్య దేశాలు భారతదేశాన్ని క్వాడ్ నాయకుడిగా ఎందుకు నిలబెట్టాయి? క్వాడ్, బ్రిక్స్, ఎస్సీఓ లలో భారతదేశం ఏకకాల సభ్యత్వం గురించి పశ్చిమ దేశాలు అయోమయంలో ఉన్నాయి.
చైనా, రష్యా అంతర్జాతీయ వేదికపై ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అమెరికా పెద్ద సమస్య ఏమిటంటే రెండు దేశాలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే, పాశ్చాత్య దేశాలు ఎప్పుడూ అమెరికాకు అండగా నిలుస్తాయి. భారత్ గురించి మాట్లాడితే.. భారతదేశం అమెరికా మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. అలా అని.. భారతదేశం అమెరికాతో పూర్తిగా ఏకీభవించదు. దీనికి అతిపెద్ద ఉదాహరణ రష్యా – యుక్రెయిన్ యుద్ధ సమయంలో కనిపించిది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని భారత్ తో సహా పలు దేశాలపై అమెరికా ఒత్తిడి తెచ్చింది. ఆ సమయంలో భారతదేశం తన ఇంధన భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగించింది. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. రష్యా – యుక్రెయిన్ యుద్ధం పాశ్చాత్య దేశాల సమస్య.. మొత్తం ప్రపంచానిది కాదని చెప్పారు.
గత మూడు నెలలుగా మోదీ విదేశాంగ విధాన కార్యకలాపాలు భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యాల గురించి ముఖ్యమైన సూచనలను అందించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో, ఆ తరువాత జెలెన్స్కీతో జరిగిన సమావేశం భారత్ తటస్థ వైఖరిని హైలెట్ చేసింది. ఇదే సమయంలో ఆగ్నేయాసియాలో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని విస్మరించలేము. భారతదేశం పశ్చిమ దేశాలతో.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో, ఆగ్నేయాసియాలో సహకరించుకునే అవకాశాలను చూస్తోంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, పెట్టుబడులను తీసుకురావడానికి, చైనా నుంచి దూరంగా వెళ్లాలని చూస్తున్న కొన్ని ఎంఎన్సీలను ఆకర్షించడానికి స్పష్టమైన విధానాన్ని అవలంభిస్తుంది. ఆగ్నేయాసియాలో చైనా విస్తరణవాదాన్ని నియంత్రించడంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తానికి ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం తన అభివృద్ధి లక్ష్యాలను, దేశ భద్రతను సమతుల్యం చేసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.