ఇరాన్ అర్మాన్ వర్సెస్ ఇజ్రాయెల్ థాడ్..! పశ్చిమాసియాలో ఇక రక్తపాతమేనా?
అదే జరిగితే ప్రపంచం రెండుగా విడిపోవడానికి, మూడో ప్రపంచ యుద్ధం రావడానికి పెద్ద సమయం పట్టదు.

Iran Israel War : యుద్ధం అంటే ఆకాశం నుంచి మేఘాలు వర్షాన్ని కాదు మరణాన్ని కురిపించడం. శవాలను తుపాకులు కుప్పలుకుప్పలుగా ప్రసవించడం. ఇలాంటి యుద్ధ భయమే కనిపిస్తోంది పశ్చిమాసియాలో. యుద్ధానికి సిద్ధమని ఇరాన్, ఇజ్రాయెల్ చెప్పేసినట్లే. రెండు దేశాలు ఆయుధ పూజ మొదలు పెట్టేశాయి. మిలటరీ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరకు అన్నింటిని రెండు దేశాలు స్ట్రాంగ్ చేసేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సిద్ధం చేసిన ఆయుధాలు ఏంటి? రెండు దేశాలు యుద్ధంలోకి దిగినట్లేనా? పశ్చిమాసియాలో ఇక రక్తపాతమేనా?
ఇరాన్ అర్మాన్ వర్సెస్ ఇజ్రాయెల్ థాడ్.. ఎప్పుడు ఏం జరుగుతుతుందోననే భయం. ఎవరు ఏం చేస్తారో అనే టెన్షన్. వీటన్నింటి మధ్య పశ్చిమాసియా వణికిపోతోంది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. మళ్లీ దాడులు చేసే సత్తా ఉన్నా, బలమైన సైన్యం ఉన్నా.. ఇజ్రాయెల్ ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉంది. ఆ మౌనం ప్రపంచాన్ని భయపెట్టింది. ఇరాన్ మీద దాడికి ముందు హమాస్, హెజ్ బొల్లాను టార్గెట్ చేసింది. దాదాపు పెద్ద తలకాయలను లేపేసింది.
ఇక ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, హైఫా నగరాలను టార్గెట్ చేసుకుని హెజ్బొల్లా డ్రోన్ దాడులకు దిగింది. ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్ అటాక్ ప్లాన్ తో ఇజ్రాయెల్ కు కోపం వచ్చింది. ఇరాన్ ను వదిలిపెట్టేది లేదని ఫిక్స్ అయ్యింది. సమరభేరి మోగించింది. ఇదీ ప్లాన్..ఊ అనండి అన్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని ముందు సైన్యం ఓ లిస్టు కూడా పెట్టింది. అదే లిస్టును అమెరికాకు కూడా ఇచ్చింది. దీంతో యుద్ధం అనివార్యమైంది. నవంబర్ 5లోపే దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుండగా.. అదే లెవల్ లో కౌంటర్ ఇచ్చేందుకు ఇరాన్ రెడీగా ఉంది.
అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రపంచానికి మన పవర్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఇంతకీ ఇజ్రాయెల్ ఏం ప్లాన్ చేస్తోంది? ఇరాన్ మీద ఎలాంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది? పశ్చిమాసియాలో రక్తపాతం తప్పదా? ఇజ్రాయెల్ మంత్రి మాటలకు అర్థమేంటి? ఇజ్రాయెల్ దూకుడు అమెరికాను కూడా టెన్షన్ పెడుతోందా?
ఇరాన్ తో కంపేర్ చేస్తే సైనిక పరంగా ఇజ్రాయెల్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. జనాభా పరంగా చిన్న దేశమైనా సైన్యం పరంగా ఎవరూ అందుకోలేని ఎత్తులో ఉంది. రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయింపులు, అడ్వాన్స్డ్ రిజర్వ్ ఫోర్స్ లు, మొసాద్ లాంటి నిఘా వ్యవస్థ, పైగా అమెరికా లాంటి మిత్ర దేశాల సపోర్ట్.. అన్నీ కలిసి ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత బలంగా మార్చాయి. ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉంది. యుద్ధం ముదిరి ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తుంది అనుకుంటే.. ఇరాన్ వైపు చైనా, రష్యా మద్దతుగా దిగే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే ప్రపంచం రెండుగా విడిపోవడానికి, మూడో ప్రపంచ యుద్ధం రావడానికి పెద్ద సమయం పట్టదు.
Also Read : దటీజ్ ఇండియా..! దిగొచ్చిన చైనా, బోర్డర్ డీల్‌కు ఓకే..! డ్రాగన్‌ను భారత్ ఎలా దారిలోకి తెచ్చిందంటే..