దటీజ్ ఇండియా..! దిగొచ్చిన చైనా, బోర్డర్ డీల్‌కు ఓకే..! డ్రాగన్‌ను భారత్ ఎలా దారిలోకి తెచ్చిందంటే..
ఇండియా-చైనా బోర్డర్ అగ్రిమెంట్ లో అసలేముంది? ఈ డీల్ సక్సెస్ అవడం అంటే భారత్ ఖాతాలో గొప్ప విజయం పడినట్లేనా?

India China Border Deal : ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. భారత్ కు పర్ ఫెక్ట్ గా సరిపోయే మాట ఇది. స్నేహితుడి దగ్గర తగ్గడం, శత్రువు మీద నెగ్గడం.. ఇదీ ఇండియా తీరు. మాతో పెట్టుకోకు.. దేనికైనా తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తోంది భారత్. బోర్డర్ లో తోక జాడిస్తూ ఓవరాక్షన్ చేసిన చైనాకు చుక్కలు చూపించింది. బోర్డర్ డీల్ కు రూట్ క్లియర్ చేసింది. డ్రాగన్ కు భారత్ పవర్ ఏంటో చూపించింది.
భారత్ బలాన్ని తక్కువ ఊహించుకున్నారో, బలగాన్ని తక్కువ అంచనా వేశారో.. బోర్డర్ లో చైనా చేయని ఓవరాక్షన్ లేదు. కవ్వింపు చర్యలకు దిగడం, చర్చల్లో ఓకే అని ఆ తర్వాత పిచ్చి వేశాలు వేయడం.. గల్వాన్ లోయ ఘటన తర్వాత చైనా చేయని దగుల్బాచీ పని లేదని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చైనా దూకుడుకు సరిహద్దుల్లో చెక్ పెడుతూనే.. రష్యా లాంటి స్నేహితులకు అండగా నిలుస్తూ బలం పెంచుకున్న భారత్.. డ్రాగన్ కంట్రీ మీద ప్రెజర్ పెంచింది. ఇప్పుడు దిగొచ్చేలా చేసింది. బోర్డర్ డీల్ విషయంలో జరిగింది అదే. బ్రిక్స్ సమావేశాల వేదికగా మోదీ చక్రం తిప్పారు. కట్ చేస్తే వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతలను తగ్గించడంపై చైనా, భారత్ పై ఏకాభిప్రాయం కుదిరింది.
ఇండియా-చైనా బోర్డర్ అగ్రిమెంట్ లో అసలేముంది? ఈ డీల్ సక్సెస్ అవడం అంటే భారత్ ఖాతాలో గొప్ప విజయం పడినట్లేనా? ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? నాలుగేళ్ల ముందు ఉన్నట్లు రెండు దేశాల మధ్య పరిస్థితుల ఉండబోతున్నాయా? డ్రాగన్ ను అసలు నమ్మొచ్చా? లేదా?
ప్రస్తుతం చైనా, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితుల నడుమ.. బోర్డర్ అగ్రిమెంట్ డీల్ ఓకే అయ్యిందంటే.. అది కచ్చితంగా ఇండియా సాధించిన గొప్ప విజయమే. చైనా మీద అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ వేయించగలిగింది. ఎల్ ఏ సీ వెంట స్టేటస్ కో పరిస్థితులకు నాలుగేళ్లుగా వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా.. ఇప్పుడు దారిలోకి వచ్చింది. సైనిక పరంగా, దౌత్య పరంగా ఈ సరిహద్దు ఒప్పందం భారత్ కు భారీ విజయంగా మిగులుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
Also Read : త్రిశూల వ్యూహం అమలు చేస్తున్న ఇజ్రాయెల్..! అసలేంటి వ్యూహం? హమాస్, హెజ్బొల్లాను ఎలా దెబ్బకొట్టనుంది?