Lucky Draw : అదృష్టం అంటే నీది భయ్యా..! లాటరీలో రూ.60కోట్లు.. కానీ, చివరిలో బిగ్ ట్విస్ట్.. అయ్యో.. ఎక్కడున్నావ్ సామీ..
Lucky Draw యూఏఈలో ఉండే ఓ ప్రవాస భారతీయుడిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ అయిన
                            Lucky Draw
Lucky Draw : జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. వందల కోట్ల ఆస్తిపరుడు రాత్రికి రాత్రే బికారి కావొచ్చు.. బికారి కాస్త రాత్రికిరాత్రే కోటీశ్వరుడు కావొచ్చు. అదృష్టం కలిసొస్తే నిమిషాల్లో జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి.
ముఖ్యంగా లాటరీల్లో భారీ మొత్తాన్ని గెలుచుకుంటున్న వారి గురించి తరచుగా వార్తల్లో చదువుతున్నాం.. అదే తరహాలో ఓ ప్రవాస భారతీయుడికి లక్కు తలిగిలింది. లక్ష్మీదేవి తలుపుతట్టింది. లాటరీలో ఏకంగా రూ.60కోట్లు వచ్చాయి. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్.. లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని అతను ఇంకా అందుకోలేక పోయాడు.
యూఏఈలో ఉండే ఓ ప్రవాస భారతీయుడిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్ లో ప్రవాసుడైన శరవణన్ వెంకటాచలంకు లక్కు తగిలింది. అబుధాబిలో నివసించే ఆయన గత అక్టోబర్ 30వ తేదీన ‘463221’ నంబరుతో ఉన్న టికెట్‌ను కొనుగోలు చేశారు.
ఈనెల 3వ తేదీన నిర్వాహకులు డ్రా తీయగా.. వెంకటాచలం కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. దీంతో అతను 25 మిలియన్ల దిర్హామ్ లు (సుమారు రూ. 60.42కోట్లు) గెలుచుకున్నారు. కానీ, ఇప్పటికీ ఆ మొత్తాన్ని అతను అందుకోలేక పోయాడు.
వెంకటాచలం కొనుగోలు చేసిన టికెట్ కు జాక్‌పాట్ తగలడంతో షో నిర్వాహకులు రిచార్డ్, బౌచ్రా శరవణన్‌ను ఫోన్లో సంప్రదించారు. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక షో నిర్వాహకులు చేసేదేమీ లేక ఈ మెయిల్‌లో సింహాచలంను సంప్రదిస్తామని చెప్పారు. మరి వెంకటాచలంకు ఈ సమాచారం తెలుస్తుందో లేదో చూడాలి.
