Australian Senator Varun Ghosh: ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతి వ్యక్తి వరుణ్ ఘోష్.. అభినందించిన ప్రధాని, విదేశాంగ మంత్రి

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వరుణ్ ఘోష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా సరికొత్త సెనేటర్ ఘోష్ కు స్వాగతం. మీరు మా బృందంలో ఉండటం అద్భుతం అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

Australian Senator Varun Ghosh: ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతి వ్యక్తి వరుణ్ ఘోష్.. అభినందించిన ప్రధాని, విదేశాంగ మంత్రి

Australian Senator Varun Ghosh

Varun Ghosh : ఆస్ట్రేలియా పార్లమెంట్ లో భారత సంతతి న్యాయవాది వరుణ్ ఘోష్ అరుదైన ఘనత సాధించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా సెనేట్ కు ఎన్నికైన వరుణ్ ఘోష్.. మంగళవారం ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీత సాక్షిగా వరుణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలా చేసిన మొదటి వ్యక్తిగా ఘోష్ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా వరుణ్ ఘోష్ మాట్లాడుతూ.. నేను మంచి విద్యను పొందడం నా అదృష్టం. అదే స్థాయిలో నాణ్యమైన విద్య, శిక్షణ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని గట్టిగా నమ్ముతున్నానని, ఆమేరకు కృషి చేస్తానని చెప్పారు.

Also Read : ఏపీలో పొత్తులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఇదిలాఉంటే.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ)కి ప్రాతినిధ్యం వహించడానికి లేబర్ పార్టీ వరుణ్ ఘోష్ ను ఎంపిక చేసింది. ఇటీవలే ఫ్రాన్సిస్ బర్డ్ ఛాంబర్స్ లో న్యాయవాది అయిన 38ఏళ్ల ఘోష్.. ప్రస్తుతం సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో పార్లమెంట్ లో కొత్త సెనేటర్ గా ఎంపికయ్యాడు. పశ్చిమ ఆస్ట్రేలియా శాసనసభ, ఫెడరల్ పార్లమెంట్ సెనేట్ లో పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సెనేటర్ వరున్ ఘోష్ ను ఎన్నుకున్నాయి.

 

 

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వరుణ్ ఘోష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా సరికొత్త సెనేటర్ ఘోష్ కు స్వాగతం. మీరు మా బృందంలో ఉండటం అద్భుతం అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అదేవిధంగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్ కు లేబర్ సెనేట్ బృందంలోకి స్వాగతం పలికారు. పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా సరికొత్త సెనేటర్ వరుణ్ ఘోష్ కు స్వాగతం. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొట్టమొదటి ఆస్ట్రేలియన్ సెనేటర్. నేను తరచూ చెబుతుంటాను.. మీరు ఏదైనా విషయంలో మొదటి వ్యక్తి అయినప్పుడు.. మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు చివరివారు కాదు.. అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సెనేటర్ ఘోష్ వెస్ట్ ఆస్ట్రేలియన్లకు బలమైన గొంతుకగా ఉంటారని ఆమె అన్నారు.

వరుణ్ ఘోష్ 1985లో జన్మించారు. 1997లో పెర్త్ కు వెళ్లి క్రైస్ట్ చర్చ్ గ్రామర్ స్కూల్ లో విద్యనభ్యసించాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి కళలు, న్యాయశాస్త్రంలో డిగ్రీలను అందుకున్నాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్. వరుణ్ గతంలో న్యూయార్క్ లో ఫైనాన్స్ అటార్నీగా, వాషింగ్టన్, డీసీలో ప్రపంచ బ్యాంకు సలహాదారుగా పనిచేశాడు. వరుణ్ ఘోష్ యొక్క రాజకీయ ప్రయాణం ఫెర్త్ లోని ఆస్ట్రేలియా లేబర్ పార్టీలో ప్రారంభమైంది. వరుణ్ ఘోష్ కు 17ఏళ్ల వయస్సులోనే లేబర్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.