ఏపీలో పొత్తులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

అదే పద్ధతిని ఇప్పుడున్న వైఎస్ జగన్ కూడా పాటించాలని, కానీ ఆయన పాటించడం లేదన్నారు పురంధేశ్వరి. ముఖ్యమంత్రి జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

ఏపీలో పొత్తులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari

Purandeswari : ఏపీలో పొత్తుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పొత్తులపై పార్టీ అధిష్టానం సరైన సమయంలో స్పందిస్తుందని ఆమె చెప్పారు. జనసేన ఇప్పటికీ తమ మిత్రపక్షమే అన్నారామె. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీజేపీ సిద్ధంగానే ఉందని తెలిపారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ? పొత్తుతో కలిగే లాభాలు ఏంటి, ఎదురయ్యే సవాళ్లు ఏంటి..

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా కాకుండా స్పెషల్ ప్యాకేజీలు స్వాగతించారని, వెంకయ్య నాయుడిని తీసుకొచ్చి సన్మానం కూడా చేశారని చెప్పారు. అదే పద్ధతిని ఇప్పుడున్న వైఎస్ జగన్ కూడా పాటించాలని, కానీ ఆయన పాటించడం లేదన్నారు పురంధేశ్వరి. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకే తాము సిద్ధంగా ఉన్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. అన్ని చోట్లా పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లే?