Parag Agrawal : ట్విట్టర్ కొత్త సీఈవోగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈవోగా(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియామకం అయ్యారు. భారత్‌లో పుట్టిన పరాగ్ అగర్వాల్..

Parag Agrawal
Parag Agrawal : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈవోగా(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియామకం అయ్యారు. భారత్‌లో పుట్టిన పరాగ్ అగర్వాల్.. బాంబే ఐఐటీలో గ్రాడ్యుయేషన్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్నారు. 2011 అక్టోబర్‌లో ట్విట్టర్‌లో పరాగ్ అగర్వాల్ చేరారు. నాటి నుంచి సంస్థలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ట్విట్టర్ విశిష్ట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానూ పనిచేశారు. ట్విట్టర్‌లో చేరకముందు ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూలో సేవలందించారు. ట్విట్టర్ టెక్నికల్ స్ట్రాటజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ అండ్ సైన్స్ టైమ్‌లకు ఇప్పటివరకు బాధ్యత వహించారు.
Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?
2019 డిసెంబర్‌లో పరాగ్ అగర్వాల్‌ను ప్రాజెక్ట్ బ్లూస్కై అనే ఇండిపెండెంట్ టీంకు ఇన్‌చార్జిగా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికపై దుర్భాషలాడే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించడానికి డీ సెంట్రలైజ్డ్ స్టాండర్డ్‌తో కూడిన టూల్స్ తయారు చేసే ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు, డిజైనర్లకు ఈ బ్లూ స్కై వనరుగా ఉంటుంది.
కాగా.. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్ డోర్సే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాపై ట్వీట్ చేస్తూ లేఖను జత చేశారు. ట్విటర్‌తో తనకున్న 16 ఏళ్ల అనుబంధాన్ని లేఖలో వివరించారు. సహ వ్యవస్థాపకుడి స్థాయి నుంచి సీఈవో వరకూ తన అనుభవాలను లేఖలో ప్రస్తావించారు. జాక్ రాజీనామాతో భారతీయ-అమెరికన్ పరాగ్ అగర్వాల్ ను అతడి వారసుడిగా ట్విటర్ ప్రకటించింది. పరాగ్ అగర్వాల్ ట్విటర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. కాగా, కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్‌ను తాను కూడా సమర్థిస్తున్నట్లు జార్ చెప్పారు.
Jio TV + Jio Tablet : రిలయన్స్ జియో ఫస్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయ్.. ఎప్పుడంటే?
ట్విట్టర్ ను జాక్ డోర్సే, నోహ్ గ్లాస్, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్ కలిసి జూలై 2006లో ప్రారంభించారు. 2015లో డిక్ కోస్టోలో సీఈవోగా పదవీ విరమణ చేసిన తర్వాత జాక్ డోర్సే ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు.