United States : యూఎస్ ట్రిపుల్ మర్డర్ కేసులో కుటుంబాన్ని చంపాడని భారతీయ విద్యార్ధి అరెస్టు

యూఎస్‌లో భారతీయ కుటుంబం హత్యకు గురి కావడం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుడైన భారతీయ విద్యార్ధి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు అరెస్టు చేశారు.

United States : యూఎస్ ట్రిపుల్ మర్డర్ కేసులో కుటుంబాన్ని చంపాడని భారతీయ విద్యార్ధి అరెస్టు

United States

Updated On : November 29, 2023 / 3:40 PM IST

United States : యూఎస్‌లో ఓ విద్యార్ధి తన కుటుంబ సభ్యులను కాల్చి చంపాడనే అభియోగంపై పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది.  ఓ భవనం రెండవ అంతస్తులో ఓ వృద్ధ  జంటతో పాటు వారి కుమారుడు చనిపోయి ఉండటం పోలీసులు గుర్తించారు.

Indian Students : యూఎస్‌లో విద్య అభ్యసించేందుకు ఎగబడుతున్న భారతీయ విద్యార్థులు…వరుసగా మూడో ఏడాది రికార్డ్, ఓడీఆర్ రిపోర్ట్ వెల్లడి

యూఎస్ లో 23 సంవత్సరాల ఓం బ్రహ్మ్‌భట్ అనే భారతీయ విద్యార్ధి తన కుటుంబ సభ్యులైన దిలీప్ కుమార్ కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72) , యష్ కుమార్ బ్రహ్మభట్(38) లను కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ ట్రెడిషన్స్ కాండో కాంప్లెక్స్‌లో కాల్పులు జరిగినట్లు ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓం బ్రహ్మ్‌భట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Indian Students : భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు…యూఎస్ ఎన్ని వీసాలు జారీ చేసిందంటే…

ఓం బ్రహ్మ్‌భట్ ఆయుధాలను కలిగి ఉన్నట్లు పోలీసులు చెప్పారు. గుజరాత్‌కు చెందిన ఈ యువకుడు మృతుల కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పోలీసులు చెబుతున్న ప్రకారం వారు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు అతను అక్కడ కనిపించాడు. ఆన్‌లైన్లో కొన్న ఓ తుపాకీతో నేరానికి పాల్పడినట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కేసును విచారిస్తోంది.