Virginity Tests : వర్జినిటీ టెస్టును రద్దు చేసిన సైన్యం

సైన్యంలో మహిళల ప్రవేశం కోసం నిర్వహించే అమానవీయ, వివాదాస్పద టెస్టుకు స్వస్తి పలికింది. చేతులతో తడిమి చేసే వర్జినిటీ పరీక్షలు తప్పనిసరి అన్న విధానాన్ని రద్దు చేసింది.

Virginity Tests : వర్జినిటీ టెస్టును రద్దు చేసిన సైన్యం

Virginity Tests

Updated On : August 13, 2021 / 12:07 AM IST

Virginity Tests : ఇండోనేషియా సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో మహిళల ప్రవేశం కోసం నిర్వహించే అమానవీయ, వివాదాస్పద టెస్టుకు స్వస్తి పలికింది. చేతులతో తడిమి చేసే వర్జినిటీ(కన్యత్వం) పరీక్షలు తప్పనిసరి అన్న విధానాన్ని రద్దు చేసింది. ఇకపై సాధారణ శారీరక, వైద్యపరమైన పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది. వర్జినిటీ టెస్టుకు ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవని డబ్ల్యూహెచ్ వో ప్రకటించిన ఏడేళ్లకు ఇండోనేషియా సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సైన్యం నిర్ణయంపై అక్కడి మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అలాంటి టెస్టులు చేయాల్సిన అవసరమే ఎన్నడూ లేదని నేషనల్ కమిషన్ ఆన్ వయలన్స్ అగ్నైస్ట్ ఉమెన్ హెడ్ ఆండీ అన్నారు.

టూ ఫింగర్ టెస్ట్.. మహిళల హైమన్ ను(యోని మీద సన్నని పొర) డాక్టర్లు చెక్ చేస్తారు. వారి వర్జినిటీని నిర్ధారిస్తారు. అయితే ఇలాంటి చర్యలు అమానవీయం అని, క్రూరమైనవని న్యూయార్క్ బేస్డ్ హుమన్ రైట్స్ వాచ్ చెప్పింది. ఆ విధానానికి స్వస్తి చెప్పాలంది.

కాగా, ఆర్మీలో చేరాలనుకునే మహిళల నైతికత నిర్ధారించేందుకు వర్జినిటీ టెస్ట్ చేస్తున్నామని గతంలో ఇండోనేషియా సైన్యం చెప్పింది. అయితే..వర్జినిటీ టెస్టుకు ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవని డబ్ల్యూహెచ్ వో గతంలోనే ప్రకటించింది. మొత్తానికి ఇండోనేషియా సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్మీలో అలాంటి టెస్టులు ఉండవని ఆర్మీ చీఫ్ అండికా పెర్కాసా చెప్పారు. “హైమెన్ చీలిందా లేదా పాక్షికంగా చీలిందా అనేది పరీక్షలో భాగం … ఇప్పుడు అంతకుమించి ఏమీ లేదు” అని సైనిక ప్రతినిధి చెప్పారు. అంతేకాదు.. సైన్యం ఎంపిక ప్రక్రియ పురుషులు, మహిళలకు సమానంగా ఉండాలన్నారు.