International Women’s Day 2024 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. వాకిలి నుంచి ఎవరిస్టు శిఖరం వరకు.. వంట గది నుంచి అంతరిక్షం వరకు..!

International Women's Day 2024 : మహిళలు పేదరికాన్ని పట్టుదలగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి విజయం సాధిస్తున్నారు. మరికొందరు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.

International Women’s Day 2024 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. వాకిలి నుంచి ఎవరిస్టు శిఖరం వరకు.. వంట గది నుంచి అంతరిక్షం వరకు..!

International Women’s Day 2024: All you need to know, from theme to history, significance and more

Updated On : March 8, 2024 / 12:19 AM IST

International Women’s Day 2024 : వాకిలి నుంచి ఎవరిస్టు శిఖరం వరకు.. వంట గది నుంచి అంతరిక్షం వరకు.. అణచివేత నుంచి ఆత్మవిశ్వాసం వైపు… అవకాశాలే లేవన్న చోట ఆకాశంలో సగమై రాణిస్తోంది మహిళాలోకం. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టిస్తున్నారు మగువలు. అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా.. ఎవరో వస్తారని… ఏదోసాయం చేస్తారని ఎదురుచూడటం లేదు. అన్నింటా దూసుకుపోతున్నారు స్త్రీమూర్తులు. గడపదాటొద్దనే ఆంక్షల హద్దులను దాటి.. ప్రపంచాన్నే జయిస్తున్నారు. ఏ రంగమైనా తమకు తామే సాటి అని నిరూపించిన తెగువ, తెలివి ఆమె సొంతం.

Read Also : Dearness Allowance Hike : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు..!

నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి ద్రౌపదిముర్ము వరకు.. :
మహిళలు పేదరికాన్ని పట్టుదలగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి విజయం సాధిస్తున్నారు. మరికొందరు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం రంగంలోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి మహిళలు అడుగు పెట్టని చోటులేదు. సాధించని విజయం లేదు. నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి ద్రౌపదిముర్ము వరకు.. కల్పనా చావ్లా నుంచి BSF స్నైపర్ సుమన్ కుమారి వరకు. ఎవరు ఎక్కడా తగ్గడం లేదు. పురుషులతో సమానంగా సవాళ్లు స్వీకరిస్తూ ముందుకెళ్తున్నారు. ఆయా రంగాల్లో తమదైన ముద్రవేసిన నారీమణుల నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారత తొలి రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ :
ప్రతిభాపాటిల్ భారత తొలి రాష్ట్రపతిగా చరిత్ర పుటలొక్కి ఎక్కారు. వ్యాపారవేత్తగా జీవితాన్ని ప్రారంభించి.. దేశంలోనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించారమె. పుణె, ముంబైలో విద్యా సంస్థలను నెలకొల్పిన ఆమె..మహిళల కోసం శ్రమ సాధన టస్టు పేరుతో వసతి గృహాలను ఏర్పాటు చేశారు. గ్రామీణవిద్యార్థుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు ప్రతిభాపాటిల్. ప్రతిభాపాటిల్ తర్వాత ద్రౌపది ముర్ము రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డు క్రియేట్ చేశారు. ఓ గిరిజన రైతు కుటుంబంలో జన్మించిన ఆమె..గిరిజన హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. తర్వాత ఒడిశా ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారు. టీచర్ గా కౌన్సిలర్ గా ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్ గా ఎదిగారు ద్రౌపది ముర్ము.

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు :
తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశాన్ని పరిపాలించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విపక్షాలు సైతం మెచ్చుకునేలా పాలించి చూపించారు ఇందిరాగాంధీ. మొట్టమొదటిసారిగా అంతరిక్ష పర్యటన చేసిన మహిళగా కల్పనాచావ్లా రికార్డు క్రియేట్ చేసింది. ఎందరో పేదలకు సేవలందించిన మదర్ థెరిసా.. నోబెల్ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. రాజకీయ సేవా రంగాలతో పాటు క్రీడారంగంలోనూ ఎంతోమంది మహిళలు సత్తా చాటుతున్నారు.

టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ గా మిథాలీరాజ్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దేశ ఆర్థికమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కూడా ఓ ఉద్యోగిగా జీవితం మొదలుపెట్టారు. ఓ ప్రైవేటు సంస్థలతో ఆడిటర్ గా తర్వాత బీబీసీ న్యూస్ లో కూడా పనిచేశారు. తర్వాత రాజకీయాలవైపు ఆకర్షితురాలై.. బీజేపీలో రాజ్యసభసభ్యురాలిగా..కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో చందా కొచ్చర్ ది ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఐసీఐసీఐ బ్యాంకులో ట్రైనీగా జాయిన్ అయ్యి.. సీఈవోగా ఉన్నతస్థాయికి చేరారు. కేసులు, ఆరోపణలు ఎన్ని అవరోధాలు వచ్చినా.. నిలదొక్కుకున్నారు.

తొలి మహిళా స్నైపర్‌గా సుమన్ కుమారి రికార్డు :
లేటెస్ట్ గా బీఎస్ఎఫ్ లో తొలి మహిళా స్నైపర్ గా రికార్డు క్రియేట్ చేశారు సుమన్ కుమారి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన సుమన్ సాధారణ కుటుంబ నుంచి వచ్చింది. ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్, తల్లి హౌస్ వైఫ్. 2021లో బీఎస్‌ఎఫ్‌లో చేరిన ఆమె ఆసక్తితో కఠినమైన శిక్షణలను పూర్తి చేసి BSF స్పైపర్ గా ఎదిగింది. ఇటీవలి కాలంలో మహిళలకు అన్నింటా అవకాశాలు పెరిగాయి. అందుకే పేదరికాన్ని సైతం జయించి.. విజయాలవైపు అడుగులు వేస్తున్నారు.

తెలుగురాష్ట్రాల్లోనూ మహిళల ప్రతిభకు తక్కువేమి లేదు. మారుమూల గ్రామాల్లో పుట్టి…అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు మగువలు. వైద్య, విద్య, బ్యాంకింగ్, క్రీడ, రాజకీయ, సోషల్ సర్వీస్, న్యాయరంగాల్లో మహిళల సత్తా చూపిస్తున్నారు. ప్రొఫెసర్లుగా, పేరుగాంచిన డాక్టర్లుగా, జడ్జీలుగా, వివిధ రంగాల్లో ఉన్నతస్థాయి అధికారులుగా రాణిస్తున్నారు. ప్రైవేటు కంపెనీల్లో సీఈవోలుగా, కంపెనీ ఛైర్మన్లుగా, పారిశ్రామికవేత్తలుగా ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు మగువలు.

Read Also : Mallanna Tala Paga : శ్రీశైలం మల్లన్న పాగా విశిష్టత.. మహాశివరాత్రి నాడు దర్శించుకోనున్న లక్షలాది మంది భక్తులు