Mallanna Tala Paga : శ్రీశైలం మల్లన్న పాగా విశిష్టత.. మహాశివరాత్రి నాడు దర్శించుకోనున్న లక్షలాది మంది భక్తులు

Mallanna Tala Paga : మల్లన్న తలపాగా ధారణ చూసి తరించేందుకు లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. మహాశివరాత్రి నాడు అర్దరాత్రి లింగోద్భవం తర్వాత.. భక్తులు పెద్దసంఖ్యలో మల్లన్న పాగా దర్శించుకుంటారు.

Mallanna Tala Paga : శ్రీశైలం మల్లన్న పాగా విశిష్టత.. మహాశివరాత్రి నాడు దర్శించుకోనున్న లక్షలాది మంది భక్తులు

Procession of Mallanna Talapaga held with festive fervour

Mallanna Tala Paga : సంప్రదాయ ఉత్సవాలలో భాగంగా శ్రీశైలంలో పాగా దర్శనానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ దర్శనం ముక్తిదాయకమనీ వేద పండితులు చెబుతుంటారు. మల్లన్న తలపాగా ధారణ చూసి తరించేందుకు లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. మహాశివరాత్రి నాడు అర్దరాత్రి లింగోద్భవం తర్వాత.. భక్తులు పెద్దసంఖ్యలో మల్లన్న పాగా దర్శించుకుంటారు.

Read Also : Maha Shivratri 2024: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు

దిగంబరంగ ఆలయ శిఖరం నుంచి నవనందులకు చేనేత వస్త్రాన్ని తలపాగా ధరింపజేసే మహభాగ్యం చీరాలలోని పృద్వీ వంశస్థులకు దక్కింది. ఆ వంశానికి చెందిన నేటి తరం వారసుడు వెంకటేశ్వర్లు కుటుంబం ఈ తలపాగాను తయారు చేస్తుంది. తెల్లని వస్త్రాన్ని నియమ నిష్టలతో 365ఐదు రోజులు రోజుకి మూర చొప్పున నేస్తారు. తర్వాత గ్రామంలో అత్యద్భుతంగా ఊరేగిస్తారు.

మహశివరాత్రి సందర్భంగా లింగోద్భవ సమయంలో శ్రీశైలం మల్లన్న పెండ్లికుమారుడిగా ముస్తాబైనప్పుడు తలపాగా చుట్టే ఆచారం అనాదిగా వస్తోంది. శివక్షేత్రాలలో ఒక్కటైన శ్రీశైలమల్లన్నకు అత్యంత ప్రీతీకరమైన మహాశివరాత్రి రోజున దేవదేవుడికి తలపాగా చుట్టేది బాపట్ల జిల్లా చీరాలలోని జాండ్రపేటకు చెందిన చేనేత కుటుంబం. ఇక్కడి పృద్వీ వంశస్థులు ఈ కార్యక్రమాన్ని అనాదిగా ఆచారంగా కొనసాగిస్తున్నారు.

పృధ్వీ కుటుంబీకులు తలపాగా ధరింపజేసిన తర్వాతే మల్లన్న కళ్యాణం మొదలవుతుంది. శివరాత్రికి వారం రోజులు ముందే వస్త్రాన్ని నేయడం పూర్తిచేస్తారు. ఆ తర్వాత వారి ఇంటినుంచి తలపాగా వస్త్రాన్నీ ఊరిలో ఊరేగింపు నిర్వహిస్తారు. వేటపాలేం మండలం పందిళ్ళపల్లిలోని పునుగురామలింగేశ్వరస్వామి ఆలయంలో నిద్రచేసి.. ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుంచి శ్రీశైలం చేరుకుంటారు.

మహదేవుని లింగోద్భవ సమయంలో శివ పరమాత్మ ఆనందస్వరుపుడై విశ్వవ్యాప్తి చెందుతాడని ప్రతీతి. నిరాకారుడైనా ఆ మహాదేవుడ్ని పెళ్ళి కుమారునిగా అలంకరించడంలో భాగంగా శివనామాలను పోలిన అంచు కలిగిన తెల్లటి నూతన చేనేత వస్ర్తాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులకు తలపాగాగా చుడుతారు. తలపాగా ధారణ తర్వాత ఆలయం అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది.

Read Also : Maha Shivratri 2024: శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం.. ఇక్కడ జోలెపట్టి అడిగితే కష్టాలు తీర్చే ‘రామలింగేశ్వరుడు’..