సులేమానీ హత్యకు ఇరాన్ ప్రతీకారం
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా

ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా సైనికులకు ఆతిథ్యం ఇస్తున్న ఐన్ అల్-అస్సాద్ తో వైమానిక స్థావరంపై 12 రాకెట్లతో దాడి చేసింది. దీనిపై అమెరికా అధికారులు స్పందించారు. విచారణ జరుగుతోందన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ఎవరూ గాయపడలేదని చెప్పారు.
బాగ్దాద్ ఎయిర్ పోర్టు దగ్గరలో శుక్రవారం(జనవరి 3, 2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిం సొలేమానీపై అమెరికా దళాలు వైమానిక దాడి జరిపాయి. ఈ దాడిలో సొలేమానీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-6,2020) సోలేమానీ అంతిమయాత్ర నిర్వహించారు. లక్షల సంఖ్యలో ప్రజలు, సోలేమానీ అభిమానులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత సులేమానీ సొంత పట్టణం కిర్మన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. సొలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది. దెబ్బకు దెబ్బ తీస్తామంది.
తమ కమాండర్‌ని చంపినందుకు పగ తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్.. అందుకు తగ్గట్లే అడుగులు కూడా వేస్తోంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా జంకారా మసీద్ డోమ్‌పై ఎర్ర జెండాని ఇరాన్ ఎగరవేసింది. ఇది విప్లవానికి మాత్రమే కాదు.. చైతన్యానికి కూడా సంకేతంగా చూస్తారు. కానీ మసీదు పైభాగంలో ఎర్రజెండా ఎగరవేయడమనేది.. యుద్ధానికి కూడా సంకేతంగా చెప్తారు. అంటే.. ఇక అమెరికాతో తాడో పేడో తేల్చుకునేందుకు ఇరాన్ డిసైడ్ అయినట్లు కన్పిస్తోంది.