కరోనా భయం…70వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్

  • Published By: venkaiahnaidu ,Published On : March 9, 2020 / 12:49 PM IST
కరోనా భయం…70వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్

Updated On : March 9, 2020 / 12:49 PM IST

ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది ఇటలీ,ఇరాన్ దేశస్థులే అన్న విషయం తెలిసిందే. కరోనాను కంట్రోల్ చేసేందుకు ఇరాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇరాన్ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేలమందిని విడుదల చేసినట్లు సోమవారం(మార్చి-9,2020)ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహిం రైసీ తెలిపారు. ఈ మేరకు ఇరాన్ జ్యుడీషియరీ(న్యాయవ్యవస్థ)న్యూస్ సైట్ మిజాన్ ప్రకటించింది.

ఖైదీల విడుదల…సమాజంలో అభద్రతను సృష్టించదని….ఇది కొనసాగుతుందని రైసీ తెలిపారు. గత గురువారం కరోనా వైరస్ బారిన పడి ఇరాన్‌ విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖోలెస్లాం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.హుస్సేన్ షేఖోలెస్లాం సిరియా మాజీ రాయబారిగాను, 1981 నుండి 1997 వరకు ఉప విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 85 దేశాలకు కరోనా వ్యాప్తి చెందింది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్-19)సోకిన వారి సంఖ్య 1లక్ష దాటినట్లు రెండు రోజుల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3వేల500మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అందులో 3వేల మందికి పైగా చైనాకి చెందినవాళ్లే. చైనా తర్వాత ఇటలీ,ఇరాన్,దక్షిణ కొరియా దేశాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది.