Strait of Hormuz Closed: మళ్లీ క్లోజ్.. హర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసిన ఇరాన్.. చమురు సంక్షోభం తప్పదా?
హర్ముజ్ ను ఇరాన్ తిరిగి మూసివేయడంతో మళ్లీ గతంలోలాగే ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ పూర్తి పర్యవేక్షణ చేపడుతోంది. సముద్ర జలాలపై గట్టి నిఘా ఉంటుందని తెలిపింది.
- మరోసారి హర్ముజ్ జలసంధి మూసివేత
- అమెరికా వైఖరికి నిరసనగా ఇరాన్ నిర్ణయం
- ఇరాన్ పోర్టుల దిగ్బంధనంపై ఆగ్రహం
Strait of Hormuz Closed: మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు శాంతిస్తున్నట్లు కనిపిస్తూనే అంతలోనే మళ్లీ రాజుకుంటున్నాయి. మరోసారి హర్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. అమెరికా వైఖరిని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించడంపై నిరసన వ్యక్తం చేసింది. ప్రపంచం కోసం తాము హర్ముజ్ ని తెరిచినా అమెరికా వైఖరి మారలేదని ఆక్షేపిస్తోంది ఇరాన్. పూర్తి స్థాయి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ తేల్చి చెప్పారు.
దిగ్బంధనం పేరుతో సముద్రంపై అమెరికా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు హర్ముజ్ ను తెరిచామంది. అయితే, ఈ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ మండిపడింది. హర్ముజ్ ను ఇరాన్ తిరిగి మూసివేయడంతో మళ్లీ గతంలోలాగే ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ పూర్తి పర్యవేక్షణ చేపడుతోంది. సముద్ర జలాలపై గట్టి నిఘా ఉంటుందని తెలిపింది. ఇరాన్ నిర్ణయంతో ఈ జలసంధి నుంచి నౌకల రవాణ నెమ్మదించింది. హర్ముజ్ ను అమెరికా దిగ్బంధించినంత కాలం తాము జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ ప్రకటించింది.
అయితే, ఈ విషయంలో అమెరికా వైఖరి భిన్నంగా ఉంది. తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు హర్ముజ్ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఇదే సమయంలో ఇరాన్ తమ దేశంలోని ఎయిర్ పోర్టులను తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా అనుమతిస్తున్నట్లు ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. హర్ముజ్ కు సంబంధించి దీన్ని ఇంకొంత కాలం ఇలానే మూసి ఉంచితే ప్రపంచం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. చమురు ధరలు కూడా భారీ పెరుగుతాయి.
Also Read: వావ్.. ఇక UPI, ATM ద్వారా మీ PF డబ్బులు తీసుకోవచ్చు.. కొత్త లిమిట్ ఎంతో తెలుసా?
