Israel Hamas War : హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ఎలా ప్రవేశించారో చూశారా.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు సరిహద్దుల్లో కంచెను కత్తించి లోపలికి ఇజ్రాయెల్ లోకి ప్రవేశిస్తున్న వీడియోను ఐడీఎఫ్ అధికారిక ట్విట్ ఖాతాలో షేర్ చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివిగల వీడియోలో

Israel Hamas War : హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ఎలా ప్రవేశించారో చూశారా.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్

Israel Hamas War

Updated On : October 16, 2023 / 10:07 AM IST

Israel–Hamas war 2023: హమాస్ దాడులతో ఇజ్రాయెల్ రక్తసిక్తమైంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ లోకి చొరబడ్డ హమాస్ మిలిటెంట్లు సామాన్య పౌరులపై దాడిచేసి ఊచకోత కోశారు. మహిళలను అత్యాచారం చేసి హతమార్చారు. చిన్న పిల్లలను కూడా కనికరం లేకుండా చంపేశారు. మరికొంత మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకున్నారు. అయితే, ఇజ్రాయెల్ లోకి హమాస్ మిలిటెంట్లు ప్రవేశిస్తున్న వీడియోను సోమవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) విడుదల చేసింది. హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడిని ప్రారంభించాయి. సుమారు వేలాది మంది హమాస్ మిలిటెంట్లు గాజా-ఇజ్రాయెల్ కంచెను తొలగించి సైనిక స్థావరాలపై దాడిచేసి ఇజ్రాయెల్ పౌరులు వందలాది మందిని హతమార్చారు.

Read Also : Israel-Hamas Conflict Horror : గాజాలో పెరిగిన మృతుల సంఖ్య, ఐస్‌క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు సరిహద్దుల్లో కంచెను కత్తించి లోపలికి ఇజ్రాయెల్ లోకి ప్రవేశిస్తున్న వీడియోను ఐడీఎఫ్ అధికారిక ట్విట్ ఖాతాలో షేర్ చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివిగల వీడియోలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి భద్రతా అడ్డంకులను ఛేదించడంతో ఆకస్మిక దాడికి పాల్పడినట్లు చూపుతోంది. హమాస్ మిలిటెంట్లు మోటార్ బైక్ లపై సరిహద్దు దాటి మెటల్ కంచెలోని రంధ్రం గుండా వెళ్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన తరువాత, పుటేజీలో మిలిటెంట్లు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్లడం, తెలియని ఇజ్రాయెల్ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వీడియోలో కనిపిస్తోంది.