Israel Palestine Conflict: గాజా స్ట్రాప్ మీద అణుబాంబు వేస్తామన్న ఇజ్రాయెల్ మంత్రి.. ప్రధాని బెంజమిన్ ఏమన్నారంటే?

ఎలియాహూ ప్రకటన అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ.. ‘‘మంత్రి అమిహై ఎలియాహూ చేసిన వాస్తవ ప్రాతిపదికన లేదు. ఇజ్రాయెల్ సహా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) అంతర్జాతీయ న్యాయ చట్టాలను అనుసరించి నడుస్తున్నాయి

Israel Palestine Conflict: గాజా స్ట్రాప్ మీద అణుబాంబు వేస్తామన్న ఇజ్రాయెల్ మంత్రి.. ప్రధాని బెంజమిన్ ఏమన్నారంటే?

Israel Palestine Conflict: గాజా స్ట్రిప్ మీద అణుబాంబు వేస్తామన్న ఇజ్రాయెల్ హెరిటేజ్ మంత్రి అమిహై ఎలియాహును తొలగించారు. పాలస్తీనా కేంద్రంగా పని చేస్తున్న హమాస్ ఉగ్రవాద సంస్థను అంతం చేసేందుకు అవసరమైతే గాజా స్ట్రిప్పులో అణుబాంబు వేసే అవకాశాలు కూడా ఉన్నట్లు అంతకు ముందు ఎలియాహు అన్నారు. అయితే ఎలియాహు చేసిన ఈ ప్రకటనను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఖండించారు. తాము అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు లోబడి ఉన్నామని, అమాయక ప్రజలకు ఏ హానీ జరగనీయమని అన్నారు. అయితే ఇదే సందర్భంలో హమాస్ సంస్థను మాత్రం వదిలిపెట్టమని నెతన్యాహూ అన్నారు.

ఒక రేడియో సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలియాహూ మాట్లాడుతూ అణుబాంబు వేస్తారా అని ప్రశ్నించగా.. అలాంటి అవకాశాలు లేకపోలేదు అని సమాధానం ఇచ్చారు. నిజానికి ఆయన ఇటామర్ బెన్ గ్విర్ అనే అతివాద పార్టీ నాయకుడు. అయితే ఆయన యుద్ధ నిర్ణయాలు తీసుకునే భద్రతా మంత్రిత్వ మండలిలో సభ్యుడు కాదు. ఇక గాజా ప్రజలకు మానవ అవసరాల్ని తరలించడంపై ఆయన కాస్త అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌరులకు మానవ సహాయం అందించడం మంచిదే కానీ, అది పక్కదారి పట్టి హమాస్ ఉగ్రవాదులకు చేరుతోందని అన్నారు.

ఇక ఎలియాహూ ప్రకటన అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ.. ‘‘మంత్రి అమిహై ఎలియాహూ చేసిన వాస్తవ ప్రాతిపదికన లేదు. ఇజ్రాయెల్ సహా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) అంతర్జాతీయ న్యాయ చట్టాలను అనుసరించి నడుస్తున్నాయి. అమాయక ప్రజలకు మేము ఎంత మాత్రం హాని జరగనివ్వం. అణుబాంబు దాడులనేవి ఊహాజనితమే. అయితే హమాస్ ఉగ్రవాదుల మీద విజయం సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.