డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ నకు శుభాకాంక్షలు తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు

Benjamin Netanyahu Donald Trump

Updated On : November 6, 2024 / 2:02 PM IST

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించాడు. తద్వారా రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల అధినేతలు పలువురు డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విటర్ ఖాతాలో డొనాల్డ్ ట్రంప్ తో తను, తన భార్య సారా నెతన్యాహు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

Also Read: ఇది అమెరికన్లు గర్వించే విజయం: అమెరికా అధ్యక్షుడిగా గెలుపుపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగం

ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు శుభాకాంక్షలు.చరిత్రలో గొప్ప పునరాగమనానికి అభినందనలు. మీరు వైట్ హౌస్ లోకి తిరిగిరావడం అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి నాంది. అమెరికా, ఇజ్రాయెల్ బంధం మరింత బలోపేతం అవుతుంది. అంటూ ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నాడు.