ఇది అమెరికన్లు గర్వించే విజయం: అమెరికా అధ్యక్షుడిగా గెలుపుపై డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం
ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.

Donald Trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
ఇది అమెరికన్లు గర్వించే విజయమని చెప్పారు. తమ దేశం కోలుకునేందుకు తన విజయం దోహదపడుతుందని చెప్పారు. అమెరికన్ల కోసం తాను ప్రతిరోజు పోరాడుతూనే ఉంటానని ట్రంప్ చెప్పారు. అమెరికా గోల్డెన్ ఏజ్‌ను చూడబోతుందని అన్నారు.
“నేను మీ కోసం, మీ కుటుంబం, మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ పోరాడతాను. పిల్లలకు బలమైన, సురక్షితమైన, సంపన్నమైన అమెరికాను అందించే వరకు నేను విశ్రమించను. నిజంగా అమెరికాలో సువర్ణ యుగాన్ని చూడొచ్చు’’ అని అన్నారు.
ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు బాగాపోరాడారని తెలిపారు. రిపబ్లికన్ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఉద్యమం ఇదని చెప్పారు. ఏ కాలంలోనూ ఇటువంటి రాజకీయ ఉద్యమాన్ని ప్రజలు చూడలేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అమెరికాకు సాయపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమెరికా సరిహద్దులను సరిదిద్దుకోవడంతో పాటు తమ దేశానికి సంబంధించిన ప్రతిదాన్ని సరిచేయాల్సి ఉందని తెలిపారు. ట్రంప్ గెలుపుతో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు.
వెక్కి వెక్కి ఏడ్చిన కమలా హారిస్ మద్దతుదారులు