Shocking :ఆరేళ్లు అంతరిక్షంలో ఉన్న ఎలుక స్పెర్మ్..168 పిల్లలకు జన్మనిచ్చింది..!!

ఆరు సంవత్సరాల పాటు అంతరిక్షంలో ఉన్న ఎలుక స్పెర్మ్ ను ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. 2013లో అంరిక్షంలోకి పంపించిన ఎలుక స్పెర్మ్ ను భూమిమీదకు తీసుకొచ్చిన తరువాత దానికి 168 పిల్లలు పుట్టాయి. పుట్టిన ప్రతీ ఎలుక పిల్లా పూర్తి ఆరోగ్యంగా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉందని సైంటిస్టులు తెలిపారు.

Shocking :ఆరేళ్లు అంతరిక్షంలో ఉన్న ఎలుక స్పెర్మ్..168 పిల్లలకు జన్మనిచ్చింది..!!

Rat Sperm In Space For Six Years

Updated On : June 12, 2021 / 1:18 PM IST

Rat sperm in space for six years : ఈ భూమ్మిదే కాదు అంతరిక్షంలో కూడా వింతలకు కొదవలేదు. ఈ క్రమంలో మరో ఆశ్యర్యకరమైన..అత్యద్భుతమైన..అరుదైన ఘటన జరిగింది. ఆరు సంవత్సరాల పాటు అంతరిక్షంలో ఉన్న ఎలుక స్పెర్మ్ (Sperm) ఉంది. దాన్ని భూమ్మిదకు తీసుకొచ్చి కొన్ని ప్రత్యేక పద్ధతుల ప్రక్రియలతో పిల్లలు కూడా జన్మించటం మరో విశేషం. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో శుక్రవారం (జూన్ 11,2021)న ఈ వార్త ప్రచురించగా అది చదివినవారంతా ఆశ్చర్యపోతున్నారు.

2013 లో భూమి మీద నుంచి ఎలుక స్పెర్మ్ ని అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి 2013లో స్పెర్మ్ ని తీసుకు వెళ్లారు. దాన్ని వ్యోమోగాములు మైనస్ 139 డిగ్రీల ఫారెన్ హీట్ (మైనస్ 95 డిగ్రీల సెల్సియస్) తో ఫ్రీజర్ లో భద్రపరిచాయి. దాన్ని దాదాపు ఆరు సంవత్సరాల ( 5 సంవత్సరాల 10 నెలలు) తరువాత 2019 లో స్పేస్‌ఎక్స్ కార్గో క్యాప్సూల్‌లో దాన్ని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చారు. అది తాజాగానే ఉండటంతో దాన్ని మీద పరిశోధనలు చేశారు సైంటిస్టులు. ఆ స్పెర్మ్ తో పిల్లలు జన్మిస్తాయా?లేదా?అనే ఆలోచనతో ఆ స్పెర్మ్ ను కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా యత్నించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.ఫలితంగా ఆ స్పెర్మ్ నుంచి పిల్లలు జన్మించాయి…! ఆ పిల్లలుకూడా చక్కటి ఆరోగ్యంతో ఉండటం సైంటిస్టులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన ఎలుక స్పెర్మ్ ని రీప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉపయోగిస్తే ఆరోగ్యకరమైన 168 పిల్లలకి జన్మనిచ్చింది ఆ స్పెర్మ్…!! ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..ఈ పిల్లలకు ఎటువంటి అవలక్షణాలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా జన్మించాయి. ఎటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా లేవు. స్పెర్మ్ నుంచి జన్మించిన ప్రతి ఎలక పిల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఎలుక సాధారణంగా పిల్లలకు జన్మిస్తే ఆ పిల్లలు ఎలా ఉంటాయో ఈ స్పెర్మ్ ద్వారా పుట్టిన పిల్లలు కూడా అంతే నార్మల్ గా వున్నాయి.ఆరేళ్ల తర్వాత తిరిగి రేప్రొడెక్షన్ ప్రాసెస్ ని దీని మీద ప్రయోగిస్తే ఈ ఫలితాలు రావడం నిజంగా షాకింగ్ గా ఉంది అని సైంటిస్టులు చెబుతున్నారు.

కాగా..జపాన్ లోని యూనివర్సిటీ ఆఫ్ యమనాషి 3 బాక్సులతో ఎలుక స్పెర్మ్స్ ని పంపించింది. ప్రతి ఒక బాక్స్ లో 48 స్పెర్మ్స్ ఉన్నాయి. వీటినన్నిటిని 2013లో పంపించింది. ఈ అధ్యయనం లో ఉపయోగించిన ఫ్రీజ్-ఎండిన స్పెర్మ్‌ను ఆర్బిటాల్ అవుట్‌పోస్టులో 200 సంవత్సరాల వరకు నిల్వ చేయ వచ్చని పరిశోధకుల బృందం చెప్పింది.