Japan Earthquake : బాబోయ్.. న్యూఇయర్ వేళ జపాన్‌ను వణికించిన భారీ భూకంపం..

Japan Earthquake : న్యూఇయర్ వేళ జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. జపాన్ తూర్పు నోడా ప్రాంత తీరంలో రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది.

Japan Earthquake : బాబోయ్.. న్యూఇయర్ వేళ జపాన్‌ను వణికించిన భారీ భూకంపం..

Japan Earthquake

Updated On : January 1, 2026 / 7:22 AM IST

Japan Earthquake : న్యూఇయర్ వేళ జపాన్‌ను భారీ భూకంపం వణికించింది.  కొద్దిరోజుల క్రితమే జపాన్‌ (Japan) లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంప ధాటి నుంచి కోలుకుంటున్న క్రమంలోనే మరోసారి.. న్యూఇయర్ వేళ భారీ భూకంపం (Earthquake) తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read : Wild Elephant: కెమెరాను చూసి రెచ్చిపోయిన ఏనుగు.. ఏం చేసిందంటే..

జపాన్ వాసులు 2026 నూతన సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ భూకంపం సంభవించడం తీవ్ర ఆందోళన కలిగించింది. జపాన్ తూర్పు నోడా ప్రాంత తీరంలో రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది.

భూకంప కేంద్రం నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్రమట్టానికి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం కేంద్రం లోతు తక్కువగానే ఉన్నప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో జపాన్ ను వరుస భూకంపాలు వణికించాయి. డిసెంబర్ 8వ తేదీన 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. డిసెంబర్ 12వ తేదీన 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూంకంపాల ధాటికి సునామీ హెచ్చరికలుసైతం జారీ చేసిన విషయం తెలిసిందే.


ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి, కనీసం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి భూకంపం సంభవిస్తుంది. పసిఫిక్ బేసిన్‌ను పాక్షికంగా చుట్టుముట్టిన అగ్నిపర్వతాలు మరియు సముద్ర కందకాల “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఉన్న జపాన్, ప్రపంచంలో 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలలో దాదాపు 20%కి కారణమవుతుంది.