Usaku Maezawa Space Tour: అంతరిక్ష వివాహర యాత్రతో జపాన్​ కుబేరులు..12 రోజులు అక్కడే

అంతరిక్ష వివాహర యాత్రకు వెళ్లారు జపాన్​ కుబేరులు.. బిజినెస్ టైకూన్స్ యుసాకు, యోజో హిరానోలు. 12 రోజులు అంతరిక్ష యాత్రలో గడపనున్నారు.

Usaku Maezawa Space Tour: అంతరిక్ష వివాహర యాత్రతో జపాన్​ కుబేరులు..12 రోజులు అక్కడే

Usaku Maezawa Space Tour

Updated On : December 9, 2021 / 12:54 PM IST

usaku Maezawa space tour: టెక్నాలజీ ఎలా మారిపోయిందంటే..‘హలో రావుగారు..అలా అంతరిక్షంలోకి టూర్ వెళదాం వస్తారా?’అన్నట్లుగా మారిపోయింది. అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు శ్రీమంతులు టూర్ స్పాట్ గా మారిపోయింది. ఈ క్రమంలో అంతరిక్ష యాత్రకు మరో ముందడుగు పడింది. ఇప్పటికే అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో మంగళవారం అంతరిక్ష యాత్ర విజయవంతం అయిన విషయం తెలిసిదే.

ఈ క్రమంలో అతరిక్ష యాత్రకు మరో అడుగు పడింది. జపాన్​కు చెందిన కుబేరులు యుసాకు మిజావా, యోజో హిరానో అంతరిక్ష యాత్ర చేపట్టారు. 2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్షానికి బయల్దేరిన పర్యాటకులు వీరే కావడం గమనించాల్సిన విషయం. రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్​తో కలిసి యుసాకు, యోజో హిరానో.. సోయూజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.

Read more : US Aviation: బెజోస్ అంతరిక్ష పర్యటన.. యూఎస్ ఏవియేషన్ ఆంక్షలు కఠినతరం!

జపాన్ కాలమానం ప్రకారం బుధవారం (డిసెంబర్ 8,2021)మధ్యాహ్నం 12:38 గంటలకు రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్​తో కలిసి యుసాకు, యోజో హిరానో.. కజకి​స్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వ్యోమనౌకలో బయల్దేరారు. ఈ యాత్రలో భాగంగా.. మిజావా, హిరానో 12 రోజులపాటు అంతరిక్షంలో గడపనున్నారు.

Read more : Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం

తమ అంతరిక్ష యాత్ర గురించి మిజావా తెగ ఆనందపడిపోయారు. చిన్నపిల్లాడిలా ఆనందం వ్యక్తం చేస్తు..‘అంతరిక్షం నుంచి భూమిని చూడాలని నా కోరిక..అలాగే బరువు లేకపోవడం వల్ల కలిగే అనుభూతిని పొందాలనుకుంటున్నాను. మరి..ఎంతో ఎక్సైట్ మెంట్ తో వెళుతున్నాం. మరి నన్ను అంతరిక్షం ఎలా మారుస్తుందో ఏమో..అక్కడ అనుభూతిని ఊహించుకుంటున్నా..నా అనుభూతిని మించే ఆనందం ఉంటుందని నేను భావిస్తున్నా? .. ఈ పర్యటన తర్వాత నేను ఎలా మారుతానో చూడాలని నాకు ఆత్రుతగా ఉంది’ అంటూ చిన్నపిల్లాడిలా ఆనందపడిపోయారు.