‘నా జుట్టు భావవ్యక్తీకరణకు బలమైన ఆయుధం..ఆసియా అందానికి ప్రతీక’..6 అడుగుల కురుల అతివ

‘నా జుట్టు భావవ్యక్తీకరణకు బలమైన ఆయుధం..ఆసియా అందానికి ప్రతీక’..6 అడుగుల కురుల అతివ

Updated On : March 10, 2021 / 4:50 PM IST

Japan  women Rin Kambe  6 feet 3 inches long hair : పొడవాటి..నల్లటి జుట్టు ఉండాలని ప్రతీ అమ్మాయిలే కాదు ప్రతీ మహిళా కోరుకుంటుంది. పొడవైన జడ ఉండే అమ్మాయిల్ని ఎవరైనా పదే పదే చూస్తారు. అటువంటి పొడవైన జుట్టు కలిగిన ఓ జపాన్ అమ్మాయిని మాత్రం ‘దెయ్యం జుట్టు’ అని టీజ్ చేసేవారట.

     

కానీ ఆమె మాత్రం ‘ఆరు అడుగుల పొడువు’ కలిన ఆమె కురులను చూసుకుంటూ ‘నా జుట్టు భావవ్యక్తీకరణకు బలమైన ఆయుధం’ అంటూ గర్వపడుతుంటుంది. అమ్మాయికి జుట్టు ఎంత అందాన్నిస్తుందో టీజ్ చేసినవారికేం తెలుసు?..ఆ ఆరు అడుగుల పొడవైన జుట్టు ఉన్న ఆ అమ్మాయి పేరు ‘రిన్ కంబే’.

    

జపాన్ రాజధాని టోక్యోకు చెందిన రిన్‌ కంబే మోడల్, డ్యాన్సర్‌. కానీ రిన్ కంబేకు మోడలింగ్, డ్యాన్స్‌ వల్ల పెద్దగా పేరేమి రాలేదు. కానీ..ఆమెకున్న పొడవాటి జుట్టు వల్ల బోలెడంత పేరు వచ్చింది. ఆమె శిరోజాల పొడవు అక్షరాలా ‘ఆరు అడుగుల మూడు అంగుళాలు’. గత 15 ఏళ్లనుంచి రిన్ తన హెయిర్ ను కట్ చేయట్లేదట.

తన జుట్టు గురించి రిన్‌ కంబే ఎంతో మురిపెంగా చెప్పుకుంటుంది..జుట్టును అందంగా ఆరోగ్యంగా పెంచటం అంత ఈజీ కాదంటుంది రిన్.. కుంకుమపువ్వుతో తయారుచేసిన స్కాల్ప్ క్రీమ్ ను తరచుగా రాస్తుంటానని తెలిపింది.

మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని..ఆహారంలో ఇనుము, కాల్షియం వంటివి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని జుట్టు సంరక్షణ గురించి ఎన్నో విషయాలను తెలుపుతుంది 35 ఏళ్ల రిన్. రిన్ బౌద్ధమతాన్ని స్వీకరించింది. అప్పటి నుంచి తన జుట్టును కట్ చేయలేదట.

అంతేకాదు..నా జుట్టు గురించి ఎంతమంది ఎన్ని అన్నాగానీ..‘నా జుట్టు భావవ్యక్తీకరణకు బలమైన ఆయుధం’‘నా జుట్టు ఆసియా అందానికి ప్రతీక’. అంటూ గొప్పగా చెప్పుకుంటుంది. అలాగే తన జుట్టుచూసిన చూసిన చాలామంది ‘దెయ్యం జుట్టు’ అనే వెక్కిరించేవారని గుర్తు చేసుకుంది.

జుట్టు పెంచడం, సంరక్షించడం అంతా వీజీ కాదంటుంది రిన్. తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది అనర్గళంగా చెబుతుంది. ఆమె కష్టం వృథా పోలేదు. పొడవైన జుట్టు తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని మురిసిపోతుందీ జపాన్ జుట్టు సుందరి.