Olena Zelenska: రష్యా సైనికుల భార్యలే ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయమంటున్నారు

ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న దండయాత్రలో ఆ దేశ సైనికులు లైంగిక దాడులను ఆయుధంగా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కా ఆవేదన వ్యక్తం చేశారు.

Olena Zelenska: రష్యా సైనికుల భార్యలే ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయమంటున్నారు

Olena Zelenska

Updated On : November 30, 2022 / 2:55 PM IST

Olena Zelenska: ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న దండయాత్రలో ఆ దేశ సైనికులు లైంగిక దాడులను ఆయుధంగా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు, అల్లర్ల సమయంలో లైంగిక హింసను అరికట్టాలన్న అంశంపై లండన్ వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సతీమణి జెలెన్ స్కా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Russia vs Ukraine War: యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా ..

మాస్కో సైనిక అకృత్యాలు తారాస్థాయికి చేరాయని, బహిరంగంగానే ఉక్రెయిన్ మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దళాలు లైంగిక వేధింపులనే ఆయుధంగా వాడుతున్నాయని, లైంగిక దాడులకు పాల్పడుతున్న విషయాన్ని రష్యన్ సైనికులు వారి బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెబుతున్నారని జెలెన్ స్కా అన్నారు.

Russia vs Ukraine War: వామ్మో అంత భారీ నష్టమా..! యుక్రెయిన్‌‌లో రష్యా సైనికులు ఎంతమంది మరణించారో తెలుసా..?

మరో దారుణ విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని..  ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయాలని రష్యా సైన్యంలోని వారి భర్తలను భార్యలు  ప్రోత్సహించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఇదిలాఉంటే ఉక్రెయిన్ లో రష్యా సైనికులు సాగిస్తున్న దారుణాలను, చిన్నపిల్లలపైనా సాగిస్తున్న దారుణాలను ఉక్రెయిన్ ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చిన విషయం విధితమే.