Biden and Jinping Meet: జో బిడెన్, జిన్‭పింగ్ సర్‭ప్రైజ్ మీట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

జో బిడెన్ స్వయంగా జిన్‭పింగ్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఒక చేయి జిన్‭పింగ్ భుజంపై వేసి, మరొక చేయితో కరచాలనం చేశారు. అయితే ఈ మిటింగ్ జరిగిన నాలుగు గంటల తర్వాత జిన్ పింగ్ ను నియంత అంటూ బిడెన్ వ్యాఖ్యానించారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Biden and Jinping Meet: జో బిడెన్, జిన్‭పింగ్ సర్‭ప్రైజ్ మీట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Updated On : November 20, 2023 / 10:29 AM IST

Biden and Jinping Meet: అమెరికా, చైనా దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతోందనే కథనాల నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలు జో బిడెన్, జీ జిన్‭పింగ్ ఒక్కసారిగా కలుసుకోవడం సర్వత్రా ఆసక్తిని రేపింది. నవంబర్ 11 నుంచి 17 వరకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ (APEC) సదస్సులో ఇరు నేతలు కరచాలనం చేసుకుంటూ కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సమ్మిట్ చివరి సెషన్ కు ముందు నవంబర్ 16న ఇరు నేతలు కలుసుకున్నట్లు రిపోర్ట్ చెబుతోంది. కాగా, 2021 జనవరి తర్వాత ఇరు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఇక వీడియో ప్రకారం.. జో బిడెన్ స్వయంగా జిన్‭పింగ్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఒక చేయి జిన్‭పింగ్ భుజంపై వేసి, మరొక చేయితో కరచాలనం చేశారు. అయితే ఈ మిటింగ్ జరిగిన నాలుగు గంటల తర్వాత జిన్ పింగ్ ను నియంత అంటూ బిడెన్ వ్యాఖ్యానించారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి చైనా విదేశాంగ శాఖ గట్టిగానే స్పందించింది. అయితే బిడెన్ పేరును ప్రస్తావించకుండా ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ సమావేశం అనంతరం బిడెన్ తన ఎక్స్ ద్వారా స్పందిస్తూ ‘‘ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం’’ అని బిడెన్ పేర్కొనగా.. “ఇద్దరం ప్రజల కోసం, ప్రపంచం కోసం, చరిత్ర కోసం భారీ బాధ్యతలను భుజాలకెత్తుకున్నాం” చైనా అధ్యక్షుడు అన్నారు.