Joe Biden ice cream : అద్భుతమైన ఐస్‌క్రీములు కావాలంటే నన్ను అడగండి,అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు : జో బైడెన్
మీకు టేస్టీ టేస్టీ ఐస్ క్రీములు కావాలా..? అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను అడగండి..అద్భుతమైన ఐస్ క్రీములు ఎక్కడ దొరుకుతాయో ఆయనకు తెలుసట..

Joe Biden ice cream
Joe Biden ice cream : చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు ఐస్ క్రీములంటే ఇష్టపడనివారు ఉండరు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా ఐస్ క్రీములంటే చాలా చాలా ఇష్టం. ఈక్రమంలో బుధవారం (ఆగస్టు,2023) ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం (ఐఆర్‌ఏ) తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ మాట్లాడుతు.. పిల్లలను ఉద్ధేశించి ఐస్ క్రీముల గురించి చెప్పుకొచ్చారు. వైట్ హౌస్ సమీపంలో టేస్టీ టేస్టీ గల అద్భుతమైన ఐస్ క్రీములు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు అటువంటి అద్భుతమైన ఐస్ క్రీములు ఎవరికైనా కావాలంటే నన్నను అడగండి అంటూ చెప్పుకొచ్చారు.
వైట్‌హౌస్‌లో జరిగిన ఐఆర్ఏ కార్యక్రమంలో అసలు విషయాన్ని పక్కన పెట్టి ఐస్ క్రీములు గురించి చెప్పుకొచ్చారు.‘‘పిల్లలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వైట్‌హౌస్ దగ్గర్లో అద్భుతమైన ఐస్‌క్రీమ్ దొరికే ప్రాంతాలు నాకు తెలుసు. మీలో ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి” అంటూ సరదా సరదగా మాట్లాడారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన వారందరూ నవ్వేశారు. ఆ తర్వాత ఐఆర్‌ఏ గురించి మాట్లాడటం కొనసాగించారు.
ఐస్ క్రీములంటే బైడెన్ కు చాలా ఇష్టం. గత ఏడాది యూఎస్ మధ్యంత ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన బాస్కిన్ రాబిన్స్ (Baskin Robbins)ఐస్ క్రీమ్ తింటు కనిపించారు. బైడెన్ కు జెనీస్ స్ప్లెండిడ్ వంటివి ఇష్టమైన ఐస్‌క్రీమ్స్ అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఓ ఐస్‌క్రీమ్ బ్రాంచ్‌లో బైడెన్ కోసమే ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను తయారు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.