Joe Biden: మా దేశ అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటనకు వస్తారు: అమెరికా
Joe Biden: చతుర్భుజ భద్రతా కూటమి (QUAD)లోని సభ్య దేశాలు (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) పలు కూటములకు నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నాయని అమెరికా చెప్పింది.

Joe Biden, Modi
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ ఏడాది సెప్టెంబరులో భారత్ లో పర్యటించే అవకాశం ఉంది. తాజాగా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
జో బైడెన్ సెప్టెంబరులో భారత్ లో పర్యటించాలనుకుంటున్నారని, 2023 అమెరికా-భారత్ సత్సంబంధాలకు (India-US relationship) ఓ “గొప్ప ఏడాది” కానుందని చెప్పారు. ఈ ఏడాది భారత్ జీ-20 (G-20)కి నేతృత్వం వహిస్తుందని, అలాగే అమెరికా ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC), జపాన్ జీ7 (G7)ను నిర్వహిస్తుందని గుర్తుచేశారు.
చతుర్భుజ భద్రతా కూటమి (QUAD)లోని సభ్య దేశాలు (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) పలు కూటములకు నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నాయని అన్నారు. అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. జీ-20 నాయకుల సదస్సులో భాగంగా జో బైడెన్ తొలిసారి భారత్ కు వస్తున్నారని తెలిపారు.
మరికొన్ని నెలల్లో జరగబోయే పరిణామాల విషయంలో ఎంతో ఆసక్తిని చూపుతున్నామని చెప్పారు. మార్చిలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చతుర్భుజ భద్రతా కూటమి (QUAD)లోని సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మంత్రులతో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చించారని తెలిపారు. కాగా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఇతర అగ్ర నేతలు కూడా భారత్ రానున్నారు.
Air Hostess: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్టెస్‌కు ముద్దుపెట్టి.. అంతటితో ఆగకుండా..