ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు : 20మంది మృతి 

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 07:46 AM IST
ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు : 20మంది మృతి 

Updated On : March 3, 2019 / 7:46 AM IST

కాందహార్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి.  దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌ను వరదలు ధాటికి భారీ వర్షాలు..వరదలకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలువులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 

గత 30 గంటల్లో భారీ వర్షపాతం నమోదైందనీ..భారీ నష్టం వాటిల్లిందని  ఐక్యరాజ్యసమితి కార్యాలయం అధికారులు వెల్లడించారు. వరదల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారని యూఎన్‌వో అధికారికంగా వెల్లడించింది. వరదలతో 2 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని..మార్చి 1 నుంచి దాదాపు 400 కుటుంబాలను సైనికులు రక్షించినట్లు కాందహార్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. అటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్న అధికారులు భారీ వర్షాలు ఆటంకం కలిగిస్తున్నట్లు తెలిపారు.