Hamas Attack Israel : ఇజ్రాయెల్‌లో రాకెట్ దాడుల్లో కేరళ మహిళ మృతి..
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరులు పరస్పర దాడులతో ఘర్షణలు మొదలయ్యాయి. గజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు.

Kerala Woman Working In Israel Killed In Hamas Mortar Shelling
Kerala woman working in Israel : ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరులు పరస్పర దాడులతో ఘర్షణలు మొదలయ్యాయి. గజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు. అష్కెలాన్‌లో జరిగిన దాడిలో పలువురు మహిళలు మృతిచెందారు. ఇజ్రాయెల్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన మహిళ హమాస్ జరిపిన మోర్టార్ షెల్ దాడిలో మరణించింది.
భర్తతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగానే ఇంటిపై రాకెట్ పడింది. రాకెట్ దాడిలో కేరళకు చెందిన సౌమ్య మృతిచెందింది. ఆదిమాలికి సమీపంలో ఉన్న కంజిరామ్‌తానమ్‌కు చెందిన సౌమ్య (30) ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్ వద్ద ఒక ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తోంది. ఇది గాజా స్ట్రిప్‌కు సరిహద్దుగా ఉంది. సాయంత్రం 5.30 గంటలకు జరిగిన దాడిలో సౌమ్యతో సహా ఇద్దరు మహిళలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో పనిచేసే సౌమ్య వదిన షెర్లీ బెన్నీ ఆమె మరణవార్తను వెల్లడించారు.
స్థానిక సమయం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సంఘటన జరిగింది. మోర్టార్ షెల్ ఇంటిపైకి పడటంతో భవనం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. సౌమ్యతో పాటు వృద్ధురాలు ఇద్దరూ మరణించారు. సౌమ్య గత 7 సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌లో పనిచేస్తోంది. చివరిసారిగా 2017లో తన కుటుంబాన్ని కలిసింది. హమాస్ మోర్టార్ దాడిలో సౌమ్య మరణించినట్లు తమకు సమాచారం వచ్చిందని ఆమె బంధువు బెన్నీ తెలిపింది.
తాము రాయబార కార్యాలయాన్ని సంప్రదించామన్నారు. డీన్ కురియాకోస్ ఎంపి సహాయంతో సౌమ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సౌమ్య భర్త సంతోష్ సోదరుడు సాజీ అన్నారు. సౌమ్య, సంతోష్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇప్పటికే 28మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు.