International Yoga Day: యోగా పుట్టింది నేపాల్‌లో అంట.. ఇండియాలో కాదట

ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న జరుపుకుంటున్న సందర్భంగా ప్రముఖులంతా ఫొటోలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం మరో కాంట్రవర్సీ కామెంట్ చేశారు.

International Yoga Day: యోగా పుట్టింది నేపాల్‌లో అంట.. ఇండియాలో కాదట

International Yoga Day

Updated On : June 21, 2021 / 7:19 PM IST

International Yoga Day: ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న జరుపుకుంటున్న సందర్భంగా ప్రముఖులంతా ఫొటోలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం మరో కాంట్రవర్సీ కామెంట్ చేశారు. యోగా పుట్టింది ఇండియాలో కాదని నేపాల్ లో అని అన్నారు.

‘ఇండియా ఒక దేశంగా ఏర్పడక ముందే నేపాల్ లో యోగా ప్రాక్టీస్ చేసేవారు. యోగా ఇండియాలో పుట్టింది కాదు. యోగాను కనుగొన్నప్పుడు ఇండియా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు కాలేదు. నేపాల్ లో యోగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇండియా దేశంగానే లేదు. అంటే యోగా అనేది నేపాల్ లో కానీ, ఉత్తరాఖాండ్ లో కానీ పుట్టి ఉండాలి.

యోగా కనుగొన్న పూర్వికులు ఎవరికీ మేం క్రెడిట్ ఇవ్వలేదు. యోగా ప్రొఫెసర్స్, వారి సేవల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. మా హక్కును మేమెప్పుడూ బయటకు చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని వినిపించలేదు. ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపోజ్ దీనిని ఫ్యామస్ చేశారు. అప్పుడే దీనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది’ అని ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఓలీ అన్నారు.

నేపాల్ ప్రధాని గతంలోనూ ఇలాంటి కామెంట్ ఒకటి చేశారు. శ్రీరాముడు నేపాల్ కు చెందిన వాడంటూ కామెంట్ చేశాడు. నేపాల్ లోని చిట్వాన్ జిల్లాలో ఉన్న మడి ప్రాంతం లేదా అయోధ్యాపురిలో శ్రీరాముడు జన్మించి ఉంటాడని ఇండియాలోని అయోధ్యలో కాదని చెప్పుకొచ్చారు. అందుకే అక్కడ రాముడు, సీత, లక్ష్మణ ఇతరుల ఆలయ నిర్మాణాలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు.