వాలంటైన్స్ డే : కంటెస్ట్ లో గెలిస్తే..ఫ్రీగా విడాకులు

వాలంటైన్స్ డే : కంటెస్ట్ లో గెలిస్తే..ఫ్రీగా విడాకులు

Updated On : February 5, 2021 / 10:32 AM IST

free divorce for Valentine’s Day ఫ ఎవరైనా విడాకులు తీసుకుంటామంటే..తీసుకోవడానికి గల కారణాలు, ఇతరత్రా విషయాలు తెలుసుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి..విడాకులు తీసుకోకుండా ప్రయత్నిస్తుంటారు. వారి మధ్య ఏకాభిప్రాయం రాని పక్షంలో కోర్టు వారికి విడాకులు మంజూరు చేస్తుంటుంది. కానీ..ఇక్కడ మాత్రం విచిత్రంగా జరుగుతుంది. ఓ గేమ్ లో గెలిస్తే..విడాకులు ఫ్రీగా ఇస్తామని చెబుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. మనస్పర్థలు ఉన్న భార్యభర్తలు..తాము కలిసి జీవించలేమని..అనుకున్న వారికి ఉచితంగా విడాకులు ఇస్తామని ప్రకటిస్తోంది. Powers Law Firm in Crossville కాంటెస్ట్ నిర్వహిస్తోంది.

పోటీలో గెలిచిన విజేతకు ఉచితంగా డైవర్స్ ఇవ్వనున్నారు. కోర్టుకు అయ్యే ఖర్చులు ఆ సంస్థ భరిస్తుంది. ఈ మేరకు ఫేస్ బుక్ లో సంస్థ పోస్టు చేసింది. కోవిడ్ -19 కారణంగా..ఆర్థిక సమస్యలు అందరినీ చుట్టుముట్టాయని, వ్యక్తిగతంగా చాలా మంది కష్టాలపాలయ్యారని వెల్లడించింది. సంతోషంగా ఉండలేక..విడాకులు తీసుకొనే యోగ్యత లేక కొంతమంది చిక్కుల్లో పడ్డారని పేర్కొంది.

ఏమి చేయాలి ?
ఎందుకు విడిపోతున్నారో మెయిల్ చేయాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 15 నుంచి ఈమెయిల్ చేయాలి. ఫిబ్రవరి 19 కల్లా విన్నర్ ను ఎంపిక చేస్తారు.
చట్టపరంగా దంపతులు ఇద్దరూ విడిపోయేందుకు అంగీకరించాల్సి ఉంటుంది.

అనంతరం డైవర్స్ ఫైలింగ్ ప్రక్రియ మొదలుపెడుతారు.
పోటీలో పాల్గొనే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సినవసరం లేదు.
డైవర్స్ చేయాలని అనుకున్న వారికి మైనర్ చిన్నారులు ఉన్నట్లైతే..పేరెంట్ ఎడ్యుకేషన్ క్లాసులకు అయ్యే ఖర్చులు తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది.
విడిపోవాలని అనుకున్న వారు లోకల్ ప్రాంతానికి చెందిన వాళ్లు అయి ఉండాలి.