Malala Yousafzai at Oscars : భర్తతో కలిసి ఆస్కార్ వేడుకల్లో మెరిసిన మలాలా యూసుఫ్ జాయ్
Malala Yousafzai at Oscars: అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ (Oscars) అవార్డ్స్ వేడుకల్లో అంతర్జాతీయ తారలు సందడి చేశారు.

Malala Yousafzai at Oscars: అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ (Oscars) అవార్డ్స్ వేడుకల్లో అంతర్జాతీయ తారలు సందడి చేశారు. ఈ వేడుకల్లో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మలాలా యూసుఫ్ జాయ్ (Malala Yousafzai) తన భర్త ఆసర్ మాలిక్ కలిసి ఈ వేడుకలకు హాజరైంది. డాల్బీ థియేటర్ గోల్డెన్ కార్పెట్ పై ఈ జంట ఫొటోలకు ఫోజులుల్చింది. సిల్వర్ కలర్ ఉన్న లగ్జరీ ఫ్యాషన్ గౌన్ ధరించి ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ప్రొడ్యూస్ చేసిన ‘స్ట్రెంజర్ ఎట ద గేట్’ (Stranger at the Gate) షార్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నామినేట్ అయింది.
మాలాలా ఆస్కార్ వేడుకలకు హాజరవడం ఇదే మొదటి సారి. అందులోనూ ఆమె యంగెస్ట్ నోబెల్ ప్రెజ్ విన్నర్ కూడా. ఈ నేపథ్యంలోనే ఆమె భర్తతో కలిసి వేడుకలకు వచ్చింది. ఈ వేడుకల్లో మలాలా మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ జరుగుతున్నప్పుడు హోస్ట్ జిమ్మి కిమ్మెల్ ఆమెను ఓ కాంట్రవర్సీ ప్రశ్న అడిగాడు. దానికి మలాలా స్పందిస్తూ.. ‘నేను ఇక్కడ శాంతి గురించే మాట్లాడుతాను’ అని సమాధానం ఇచ్చింది. ఈ వీడియోలు ట్విట్టర్లో, ఫేస్బుక్ లో వైరల్ అవుతున్నాయి.
Jimmy Kimmel asks Malala Yousafzai a viewer question: “As the youngest Nobel Prize winner in history, I was wondering, do you think Harry Styles spit on Chris Pine?”
“I only talk about peace.” #Oscars#Oscars95https://t.co/OizA2V2cyr pic.twitter.com/krf3VvN7os
— ABC News (@ABC) March 13, 2023
మరోవైపు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan),కీరవాణి, జక్కనల హవా నడుస్తోంది. ఈ వేడుకల్లో జక్కన్న టీమ్ అంతా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా బ్లాక్ సూట్ వేసుకొని అలరించారు. సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Nobel Peace Prize Laureate and education advocate #Malala Yousafzai wears custom Ralph Lauren Collection to the #Oscars in celebration of the nomination for her film, “Stranger at the Gate.” pic.twitter.com/RcVBy1q3Qi
— CFDA (@CFDA) March 12, 2023