Artificial Intelligence: ఏఐ అద్భుతం చేసింది.. 50 కంపెనీల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ అందుకున్న యువకుడు
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ డిజిటల్ రంగంలో ...

artificial intelligence
Artificial Intelligence Bot: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ డిజిటల్ రంగంలో రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటూ దూసుకెళ్తుంది. ఏఐ చాట్‌బాట్‌ల సాయంతో చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఏఐ వినియోగంతో ఉద్యోగుల ఉత్పాదకత పెరిగిందన్న విషయం అనేక అధ్యయనాల్లో రుజువైంది. సీవీలు, రెజ్యూమ్, బయోడేటా, కవర్ లెటర్ అనేక ఇతర పత్రాలను ఏఐ చాట్ బాట్ ల సాయంతో అద్భుత రీతిలో సిద్ధం చేసుకొని అనేక మంది తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.
Also Read: TS High Court : బెనిఫిట్ షోలు రద్దు చేశామని అంటూ ప్రత్యేక షోలకు అనుమతేంటి?: హైకోర్టు
ఒక వ్యక్తి సొంతంగా ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోగల ఏఐ బాట్ ను రూపొందించాడు. అది అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఈ విషయాన్ని అతను రెడిట్ లో పంచుకున్నాడు. అయితే, అతనికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. తాను రూపొందించిన ఏఐ బాట్ అద్భుతాలు సాధించిందని తెలిపాడు. ఉద్యోగార్హతలను విశ్లేషించి, అందుకు తగిన విధంగా అప్లికేషన్లు రూపొందించింది. నేను నిద్రపోయి లేచేలోపు రాత్రికి రాత్రే దాదాపు వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు కూడా చేసిందని యువకుడు చెప్పాడు. నెల రోజుల వ్యవధిలోనే నాకు 50 సంస్థల నుంచి ఇంటర్వ్యూలకు రావాలని పిలుపు కూడా వచ్చిందని చెప్పాడు.
Also Read: Anam RamNarayana Reddy: తిరుపతి ఘటన.. జగన్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో క్లారిటీగా చెప్పిన మంత్రి ఆనం
యువకుడు చెప్పిన దాని ప్రకారం.. ఏఐ బాట్ స్వయంగా సీవీని సిద్ధం చేసి కవర్ లెటర్ తో పాటు సంబంధిత కంపెనీకి పంపిందని వ్యక్తి చెప్పాడు. ఆటోమేటెడ్ స్ట్రీనింగ్ సిస్టమ్ ల ద్వారా ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుందని అతడు పేర్కొన్నాడు. ఈ టెక్నాలజీని నేను సరికొత్త విప్లవంగా చూస్తున్నానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే, ఈ సాంకేతిక విప్లవాన్ని చూస్తుంటే.. ఉద్యోగుల ఎంపికలో మానవ సంబంధాల ప్రాధాన్యం తగ్గేట్లు కనిపిస్తోందని, ఎంపిక ప్రక్రియనే వేగవంతం చేయాలనే ప్రయత్నంలో మనిషి తన సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉందని చెప్పుకొచ్చాడు.