Kim Jong Un: కిమ్ డూప్లికేట్‌ను రెడీ చేసిన బార్బర్.. రిజల్ట్ చూసి షాక్ అవకండి

నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జంగ్ ఉన్ అంటే ఇంటర్నేషనల్ క్రేజ్ ఉందన్న మాట తెలిసిందే. అతని లైఫ్ స్టైల్ మాత్రమే కాదు హెయిర్ స్టైల్...

Kim Jong Un: కిమ్ డూప్లికేట్‌ను రెడీ చేసిన బార్బర్.. రిజల్ట్ చూసి షాక్ అవకండి

Kim Jong Un

Updated On : September 13, 2021 / 4:00 PM IST

Kim Jong Un: నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జంగ్ ఉన్ అంటే ఇంటర్నేషనల్ క్రేజ్ ఉందన్న మాట తెలిసిందే. అతని లైఫ్ స్టైల్ మాత్రమే కాదు హెయిర్ స్టైల్ కూడా డిఫరెంటే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కిమ్ జంగ్ ఉన్న హెయిర్ స్టైల్ కోసం ఓ వ్యక్తి బార్బర్ షాపుకు వెళ్లాడు. వాళ్లిద్దరూ కలిసి చేసిన దానికి వచ్చిన రిజల్ట్ ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుంది.

ఆ వీడియోలో ఓ వ్యక్తి కుర్చీలో కూర్చొని అద్ధంలో కనిపించే తన హెయిర్ కట్ ప్రోసెస్ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఆ హెయిర్ కట్ పూర్తి అయిన తర్వాత వాళ్లిద్దరూ కలిసి పగలబడి నవ్వుకుంటూ ఇదే కిమ్ జంగ్ ఉన్న స్టైల్ హెయిర్ కట్ అని అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక వీరి యాక్షన్ కు అదే రేంజ్ లో కామెంట్లు వస్తున్నాయి. కరెక్ట్గ్ గా సరిపోయిందని చెప్తుంటే కిమ్ ఇతణ్ని పనిలో పెట్టుకోవడం ఖాయం అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు.

 

Also Read: Ram Charan New Car : మెగా పవర్‌స్టార్.. కొత్త కార్ చూశారా..!

ఇదిలా ఉంటే గతంలో ఎప్పుడూ లేనంత సన్నగా మారిపోయి కనిపించారు కిమ్. రీసెంట్ గా జరిగిన 73వ వార్షికోత్సవంలో చాలా స్లిమ్ గా మారిపోయారు. అంతకుముందు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది పడ్డ కిమ్ ఇలా మారిపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం నెలకొంది.