KETTLE Chips : చిప్స్ ప్యాకెట్లో ‘ఆలుగడ్డ’.. కస్టమర్ షాక్!
ఆన్‌లైన్‌లో చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసిన కస్టమర్ అందులో ఆలుగడ్డ ఉండటం చూసి షాకయ్యాడు. ఈ ఘటన యూకేలో జరిగింది. కరకరలాడే చిప్స్ కు బదులుగా ఎండిపోయిన ఆలుగడ్డ కనిపించింది.

Potato In Place Of Chips In A Bag
KETTLE Chips : ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? జర జాగ్రత్త. మీరు ఆర్డర్ చేసే వస్తువులే మీకు వస్తాయని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు ఆర్డర్ చేసిన ప్యాకెట్లలో ఏదో ఒకటి బయటపడుతున్న సంఘటనలు ఎక్కడోచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆన్‌లైన్ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్‌లో చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసిన కస్టమర్ అందులో చిప్స్ కు బదులుగా ఆలుగడ్డ ఉండటం చూసి షాకయ్యాడు. ఈ ఘటన యూకేలో జరిగింది. లింకన్‌షైర్‌లోని ఉప్పింగ్‌హామ్ స్కూల్లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డేవిడ్ బాయ్స్ ఈ అనుభవం ఎదురైంది.
అక్టోబర్ 17న కెటిల్ చిప్స్ ప్యాకెట్ అతడు కొన్నాడు. చిప్స్ తినేందుకు ప్యాకెట్ తెరిచాడు. అంతే అందులో కరకరలాడే చిప్స్ కు బదులుగా ఎండిపోయిన ఆలుగడ్డ కనిపించింది. దాంతో ఆ చిప్స్ ప్యాకెట్, ఆలుగడ్డను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అనంతరం ఆ చిప్స్ ప్యాకెట్ తయారీ సంస్థకు ఫిర్యాదు చేశాడు.
Pani Puri : ప్రాణం మీదకు తెచ్చిన పానీపూరి.. గప్ చుప్ తిని 77మంది ఆసుపత్రి పాలు
So I opened a bag of @KETTLEChipsUK today to find no crisps. Just a whole potato. ? pic.twitter.com/PGEqGMqIWF
— Dr David Boyce (@DrDavidBoyce) October 16, 2021
ట్విట్టర్ పోస్టులో ఈ రోజు @KETTLEChipsUK చిప్స్ ప్యాకెట్ కొన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తిందామని చూస్తే అందులో క్రిప్స్ లేవు. కేవలం బంగాళాదుంప గడ్డ మాత్రమే ఉందన్నాడు. సదరు సంస్థ స్పందించింది. జరిగిన పొరపాటుకు అతడికి క్షమాపణలు తెలియజేసింది. ఇది ఎలా జరిగిందో విచారిస్తామని రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Bengaluru Design District : దుబాయ్ తరహాలో బెంగళూరులో 3D ‘డిజైన్ డిస్ట్రిక్’