Thirsty Eagle : బాటిల్ తో నీళ్లు అందించి..గద్ద దాహం తీర్చిన వ్యక్తిపై నెటిజన్ల ప్రశంసలు
హైవే పక్కన నీటికోసం అల్లాడుతున్న గద్దకు ఆపద్బాంధవులుగా మారారు ముగ్గురు బాటసారులు.

Man Helps Thirsty Eagle Drink Water From Bottle
Thirsty Eagle నెదర్లాండ్స్ లో హైవే పక్కన నీటికోసం అల్లాడుతున్న గద్దకు ఆపద్బాంధవులుగా మారారు ముగ్గురు బాటసారులు. దాహంతో రోడ్డు దగ్గరకొచ్చి ఆ దారివెంట పోయే వాళ్లను తదేకంగా చూస్తోన్న గద్ద బాధను అర్థం చేసుకున్నారు. దాహంతో ఉన్న ఓ గద్దకు తమ వద్ద ఉన్న బాటిల్ లోని నీటిని అందించి దాని దాహం తీర్చారు. దీనికి సంబంధించిన 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఆ వీడియోకు దాహంతో ఉన్న గద్ద మీకు కృతజ్ఞతలు తెలుపుతోంది అని క్యాప్షన్ ఇచ్చాడు ఆ నెటిజన్.
హైవే పక్కన ఓ వ్యక్తి బాటిల్ తో గద్దకు నీటిని తాగిస్తుండగా..ఇద్దరు వ్యక్తులు దానిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా,నిదానంగా గద్దకు నీళ్లు తాగించాడు. మొదట కన్ఫ్యూజ్ అయినట్లు కనిపించిన గద్ద..క్రమంగా బాటిలోని నీళ్లు తాగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు గద్ద దాహం తీర్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గద్దకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అంటూ నెటిజన్లు ఆ జంతు ప్రేమికుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంచి పనిచేశారంటూ నెటిజన్లు వారిని ప్రశంసించారు.