Living without Memory : గజిని, ప్రతి ఆరు గంటలకు జ్ఞాపకశక్తిని కోల్పోతాడు

ఓ వ్యక్తి...ప్రతి ఆరు గంటలకు జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. అంతకుముందు ఏం చేశాడో..ఎలా ఉన్నాడో..ఎవరిని కలిశాడో అతనికీ ఏమీ గుర్తుండదు.

Living without Memory : గజిని, ప్రతి ఆరు గంటలకు జ్ఞాపకశక్తిని కోల్పోతాడు

Brain

Updated On : November 14, 2021 / 12:58 PM IST

Man Loses Memory : ఓ వ్యక్తి…ప్రతి ఆరు గంటలకు జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. అంతకుముందు ఏం చేశాడో..ఎలా ఉన్నాడో..ఎవరిని కలిశాడో అతనికీ ఏమీ గుర్తుండదు. ఇదంతా వింటుంటే హీరో సూర్య నటించిన గజిని సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో కూడా అతనికి జ్ఞాపకశక్తి ఉండదు. గుర్తు పెట్టుకోవడానికి కొన్ని గుర్తులను ముందట పెట్టుకుని జీవిస్తుంటాడు. విలన్లు తలపై బలంగా బాదడంతో అతనికి ఏవీ గుర్తుండదు. కానీ..ఈ వ్యక్తిని ఎవరూ కొట్టలేదు. కారు ప్రమాదానికి గురి కావడంతో అతడు జ్ఞాపకశక్తి కోల్పోయాడు.

Read More : Bhatti Vikramarka: స్వాతంత్య్రం భిక్ష అన్నవాళ్లే దేశద్రోహులు.. కంగనా కామెంట్స్‌పై కాంగ్రెస్ సీరియస్!

డేనియల్ స్మిత్ కేవలం ఆరు గంటలు మాత్రమే విషయాలు గుర్తు ఉంచుకోగలడు. ఎక్కడెక్కడ తిరిగాడో..ఎవరితో మాట్లాడో..గుర్తు పెట్టుకోవడానికి నోట్స్ రాసుకుంటాడు. లేకపోతే..ఆరు గంటల అనంతరం అతనికీ ఏదీ గుర్తుకు రాదు. Living without Memory డాక్యుమెంటరీలో కొన్ని విషయాలు తెలిపాడు. తన సోదరిని కలుసుకోవడానికి తాను వెళ్లడం జరిగిందని, ట్రాఫిక్ జాంలో చిక్కుకపోవడం జరిగిందన్నారు. ఆ సమయంలో పెద్ద కారు దాదాపు 80 కిలోమీటర్ల స్పీడుతో వచ్చి…తన కారును ఢీకొన్నాడని తెలిపారు. తీవ్రగాయాలపాలైన తనను విమానంలో ఆసుపత్రికి తరలించారని, తలకు బలమైన గాయమైందని వైద్యులు వెల్లడించారన్నారు.

Read More :Madhya Pradesh : ఆవుల పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

దీర్ఘకాలికంగా జ్ఞాపకం ఉండదని వైద్యులు పేర్కొన్నట్లు, చేసిన పనులు..చేయాల్సిన పనులు ఇతరత్రా వివరాలను జ్ఞాపకం ఉన్నప్పుడు వివరణాత్మకంగా డైరీలో రాసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితి అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. సంబంధాలు తెగిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత..డేనియల్ కు కాథరీనా అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించాడు. డేనియల్ జీవితంలో మరిన్ని ఛాలెంజస్ వచ్చే అవకాశాలున్నాయి. కొడుకు ఎదుగుతున్న సంగతి గుర్తుకు ఉండే అవకాశం లేదు. అసలు కొడుకు పుట్టిన విషయం కూడా అతనికి తెలియదంట. ఇది నిజంగా భయంకరమైన అంశంగా అభివర్ణించాడు డేనియల్. పాత జీవితాన్ని పొందడానికి అతను ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ చేయించుకున్నా..ఫలితం కనబడడం లేదు. తనలాగా బాధ పడుతున్న వారికి డేనియల్ సహాయం చేస్తున్నాడు.