Madhya Pradesh : ఆవుల పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని వెల్లడించారు.

Madhya Pradesh : ఆవుల పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Cow Dung

Cows Their Dung : ఆవు పేడ, మూత్రంపై బీజేపీ నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో ఆవు మూత్రం తాగితే కరోనా రాదని, వైరస్ నయమవుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా…మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని వెల్లడించారు. పేడ, మూత్రం వినియోగంపై సరైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా..రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడానికి సహాయపడుతాయన్నారు.

Read More : McDonald : 4 గంటల్లో 6 వేల 400 మెక్ డెనాల్డ్ వస్తువుల ఆర్డర్ ప్యాకింగ్

ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ మహిళా పశువైద్యుల సమ్మేళనం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనేక ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసిందని, సమాజ భాగస్వామ్యంతోనే..పశుసంరక్షణ సాధ్యమౌతుందన్నారు. గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలు గోవుల పెంపకంపై ఆధారపడుతున్నారని, డెయిరీ వ్యాపారంలో వారు సఫలం అయ్యారని తెలిపారు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తమ్ రూపాలా. ఆవుల రక్షణ కోసం ప్రచారం చేయడానికి ‘మంత్రి పరిషత్ సమితి’ మంత్రుల మండలిని ఏర్పాటు చేస్తామని గతంలో సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈయన వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.