Sleep Winner: ఎవరు ఎక్కువ సమయం నిద్రపోతే వారికి డబ్బులు ఫుల్.. ఈ వింత పోటీలు ఎక్కడంటే?
మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారు..? ఒళ్లువంచి ఏదైనా పనిచేసి, లేకుంటే పలు పోటీల్లో పాల్గొని, ఇంకా ఏదైనా పనులు చేసి డబ్బులు సంపాదించొచ్చు. నిద్రపోతే డబ్బులు రావుకదా.. కానీ ఇక్కడ నిద్రపోయినోళ్లకు డబ్బులిస్తారు. ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వారికి ఫుల్ మనీ వచ్చేస్తుంది.

slepping man
Sleep Winner: మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారు..? ఒళ్లువంచి ఏదైనా పనిచేసి, లేకుంటే పలు పోటీల్లో పాల్గొని, ఇంకా ఏదైనా పనులు చేసి డబ్బులు సంపాదించొచ్చు. నిద్రపోతే డబ్బులు రావుకదా.. కానీ ఇక్కడ నిద్రపోయినోళ్లకు డబ్బులిస్తారు. ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వారికి ఫుల్ మనీ వచ్చేస్తుంది. నిద్రపోవటం అంటే మధ్యలో లేచి టిఫిన్ చేసి, టీ తాగి మళ్లీ పడుకోవటం కాదు.. ఏకంగా ఎక్కువ గంటలు ఎవరైతే నిద్రపోతారో వారు విజేతలు. వారికి డబ్బులొస్తాయి. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇలాంటి పోటీలు మాంటెనెగ్రె దేశంలో జరుగుతాయి. ఆ దేశంలోని ఓ గ్రామంలో ఏడాదికి ఓసారి ఈ వింత పోటీలు జరుగుతాయట.
మాంటెనెగ్రె దేశంలో నిక్సిక్ నగరం ఉంది. ఈ నగరానికి వెలుపల కొన్ని కిలోమీటర్ల దూరంలో బ్రెజ్నా అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ పోటీ ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు నిద్రపోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు పడుకున్న వ్యక్తికి బహుమతి లభిస్తుంది. ఈ ఏడాది జరిగిన పోటీల్లో జర్కో పెజనోవిక్ అనే వ్యక్తి విజయం సాధించాడు. అతను మొత్తం 60 గంటలపాటు ఏకదాటిగా నిద్రపోయి దాదాపు 27 వేల రూపాయలను గెలుచుకున్నాడు.
Viral Video: ఈ స్లైడ్‌పై జారితే ఒళ్లు విరగడం ఖాయం.. అయినా ఎంజాయ్ చేస్తున్న జనం.. వీడియో వైరల్
సాధారణంగా నిద్రపోవటం అంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. కానీ గంటల కొద్దీ నిద్రపోవాలంటే అది కష్టమైన పనే. ఎంత కష్టపడి వచ్చి నిద్రపోయిన మహా అంటే 12 నుంచి 20 గంటల వరకు ఏకదాటిగా నిద్రపోగలం. కానీ జర్కో పెజనోవిక్ ఏకంగా 60గంటలు లేవకుండా నిద్రపోయి విజేతగా నిలిచాడు. ఈ పోటీలు పైకి కేవలం నిద్ర పోవటమే కదా అనిపిస్తుంది కదు.. కానీ ఎక్కువ సేపు నిద్రపోవటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పనే. 60గంటలు నిద్రపోయినప్పటికీ పెజనోవిక్ గత రికార్డులను బద్దలు కొట్టలేక పోయాడు. 2021 సంవత్సరంలో ఈ పోటీలో ఒక మహిళ గెలిచింది. ఆమె 117 గంటల పాటు అంటే నాలుగు రోజుల 21 గంటల పాటు నిరంతరం పడుకుంది. ఈ పోటీలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నారు. అందులో మొదటి రోజు 7 మంది ఔట్ అయ్యారు.